అక్టోబర్ 31న ‘బఘీర’ (Bagheera) అనే (కన్నడ)డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగధూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అంటే ‘కేజీఎఫ్’ (KGF) ‘కాంతార’ ‘సలార్’ (Salaar) వంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన నిర్మాత ‘ఉగ్రమ్’. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ చిత్రానికి కథ అందించాడు. శ్రీమురళి ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమవుతున్నాడు. ఇతను ‘ఉగ్రం’ హీరో అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. నిజం చెప్పాలంటే ‘ఉగ్రం’ నే కొంచెం అటు ఇటు మార్చి ‘సలార్’ గా తీశాడు ప్రశాంత్ నీల్.
Bagheera
ఇక ‘బఘీర’ (Bagheera) ట్రైలర్లో కూడా యాక్షన్ ఎలిమెంట్స్ హైలెట్ అయ్యాయి. కేజీఎఫ్ రేంజ్ హోప్స్ ఇచ్చాయి. అయితే ఈ సినిమాకి ఎంప్టీ మైండ్ తో అంటే బ్లాంక్ మైండ్ తో రండి అంటున్నాడు హీరో శ్రీమురళి. తాజాగా తెలుగు మీడియాతో ముచ్చటించిన అతను.. ” ‘బఘీర’ సినిమాకి బ్లాంక్ మైండ్ తో రండి, ఎలాంటి అంచనాలు పెట్టుకోకండి.
ఓ కొత్త హీరోగానే నన్ను భావించండి.నా మొదటి సినిమా అనుకోండి. మేము మంచి సినిమా తీశాం. అది కచ్చితంగా చెప్పగలను.అంతకు మించి ఏం చెప్పినా హడావిడిగా అనిపిస్తుంది” అంటూ శ్రీమురళి చెప్పుకొచ్చాడు. ఒక రకంగా అతన్ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే.. ‘సినిమాలో ఇంతుంటే..
అంత ఉన్నట్టు చెప్పుకునే హీరోలు’ ఉన్న ఈ రోజుల్లో తనని, తన సినిమాని ఎంత వరకు ప్రమోట్ చేసుకోవాలో.. అంత వరకే ప్రమోట్ చేసుకున్నాడు అతను. సినిమా గురించి ఎక్కువ చేసి చెబితే.. ఎక్కువ అంచానాలుతో సినిమా చూస్తారు. అప్పుడు అంతగా రుచించకపోవచ్చు. కంటెంట్ ని ఎంతవరకు ప్రమోట్ చేయాలో అంతవరకు చేస్తే సరిపోతుంది కదా.