కన్నడ యాక్షన్ స్టార్ శ్రీ మురళి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘బఘీర’ (Bagheera) భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కథ అందించిన ఈ సినిమాకు డాక్టర్ సూరి దర్శకత్వం వహించారు. కేజీఎఫ్ (KGF) చిత్రాలకు పేరుగాంచిన హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే హైలైట్ గా మారింది.
‘బఘీర’ (Bagheera) తెలుగు, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న విడుదల కానుంది. శ్రీ మురళి నటించిన ఈ సినిమా తెలుగులో తొలిసారి విడుదల అవుతుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకుల కోసం ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పీ ద్వారా విడుదల చేస్తున్నారు. అమ్మా.. దేవుడు రామాయణం, మహాభారతం అని ఎప్పుడూ ఒక్కొక్కసారి వస్తాడు.
ఎప్పుడు ఎందుకు రాడు? అని ఒక పసి గొంతు అడగ్గా అప్పుడు.. దేవుడు అన్నిసార్లు రాడు.. సమాజంలో పాపాలు మితి మీరినప్పుడు, మంచిని చెడు తొక్కేసినప్పుడు.. సమాజంలో కుళ్ళు పెరిగినప్పుడు, మనుషులు మృగాళ్లు అయినప్పుడు ఆయన ఆ అవతారమెత్తుతాడు అంటూ ఓ తల్లి చెబుతున్నట్లు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. వెంటనే మస్క్ వేసుకొని బఘీర పాత్రలో శ్రీ మురళి అదిరిపోయే యాక్షన్ సీన్స్‌లో కనిపించారు. పాపం, దోపిడి, అత్యాచారం లాంటి క్రైమ్ లను హతమార్చేందుకు తన సొంత రీతిలో శిక్షిస్తున్న బఘీర క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా నిలిచింది.
ఇంతవరకు పోలీసులకు అజ్ఞాతంగా ఉన్న బఘీర.. అక్రమాలకు చెక్ పెట్టే విధానం, క్రిమినల్స్‌పై కఠినంగా స్పందించే తీరు ఈ ట్రైలర్ ద్వారా స్పష్టంగా కనిపించింది. యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్ వెరీ ఇంటెన్స్ గా ఉన్నాయి. వీటికి సరిగ్గా సరిపోయేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండటం సినిమాపై హైప్ పెంచింది. ప్రకాష్ రాజ్ (Prakash Raj) , అచ్యుత్ కుమార్ (Achyuth Kumar), గరుడ రామ్, రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం అందరికీ తప్పకుండా థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతి సీజన్ ముందు దీపావళి కానుకగా ‘బఘీర’ విడుదల కానుంది.