బాహుబలి కంక్లూజన్ గురించి వారు వీరు చెప్పడమే కానీ .. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నోటి నుంచి ఇంతవరకు వినలేదు. తొలి సారి నిన్న (శుక్రవారం) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాహుబలి బృందం సినిమా గురించి వివరాలను వెల్లడించింది. ఈ కార్యక్రమంలో జక్కన్న చెప్పిన బాహుబలి 2 హైలెట్స్ పై ప్రత్యేక ఫోకస్…
1. #WKKBబాహుబలి బృందం ప్రెస్ మీట్ రోజు అందరిని ఆకర్షించిన అక్షరాలు “#WKKB”. బాహుబలి 2 టైటిల్ పోస్టర్ పై ఉన్న వీటి గురించి జక్కన్న స్పష్టం చేశారు. “Why Kattappa Killed Baahubali” .. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని దాని అర్ధం. బాహుబలి 2 పై ఆసక్తిని పెంచిన అంశం అదే కాబట్టి దానిని లోగో పోస్టర్ పై ముద్రించారు.
2. పూర్తి అయిన టాకీ పార్ట్మూడేళ్లుగా కొనసాగుతున్న బాహుబలి షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. ఇప్పటికే టాకీ పార్ట్ చిత్రీకరణ కంప్లీట్ అయింది. కొన్ని ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలి ఉంది.
3. గుమ్మడికాయ కొట్టేస్తారుప్రభాస్, అనుష్కలపై రెండు పాటల చిత్రీకరణను త్వరలో జక్కన్న ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ ని నవంబర్ లో కంప్లీట్ చేయనున్నారు. అప్పుడే బాహుబలి ప్రొడక్షన్ టీమ్ కి దిష్టి గుమ్మడికాయ కొట్టేస్తారు.
4. అవంతిక ఓన్లీ యాక్షన్బాహుబలి బిగినింగ్ లో అవంతికగా అలరించిన తమన్నా కంక్లూజన్ లోను ఆకట్టుకోనుంది. అయితే ఇందులో తమన్నాకు పాటలు ఏమి లేదు. కేవలం యాక్షన్ సీన్స్ లో మాత్రమే కనిపించనుంది.
5. ప్రభాస్ ఫ్యాన్స్ గర్వపడే న్యూస్మరో నాలుగు రోజుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు గర్వపడే వార్తను చెబుతానని రాజమౌళి హామీ ఇచ్చారు. అక్టోబర్ 5 న జక్కన్న చెప్పనున్న ఆ న్యూస్ ఏమై ఉంటుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
6. బాహుబలి 2 ఫస్ట్ లుక్డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే కి ఒక రోజు ముందు (అక్టోబర్ 22)న బాహుబలి కంక్లూజన్ ఫస్ట్ లుక్ ని దర్శకధీరుడు రిలీజ్ చేసి కానుకగా అందించనున్నారు. ఆరోజు ప్రభాస్ ఫ్యాన్స్ రెండు పండుగలు జరుపుకోనున్నారు. ఇదేరోజు బాహుబలి కామిక్ బుక్ సీరిస్ ని రిలీజ్ చేయనున్నారు.
7. కొనసాగే సంబరాలుప్రభాస్ పుట్టినరోజు నుంచి బాహబలి 2 చిత్ర సంబరాలు కొనసాగే విధంగా జక్కన్న ఏర్పాట్లు చేశారు. ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23)న బాహుబలి 2 లోని వర్చువల్ రియాలిటీ వీడియోలను పరిచయం చేయనున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా మహిస్మతి రాజ్యంలోకి వెళ్లి అక్కడి సంగతులను మనం చూస్తున్నట్లు అనుభూతి చెందవచ్చు.
8. సంక్రాంతికి టీజర్పెద్ద పండుగ ఉత్సాహాన్ని పెంచడానికి బాహుబలి ముస్తాబు అవుతున్నాడు. సంక్రాంతి ని పురస్కరించుకొని బాహుబలి టీజర్ ని రిలీజ్ చేయడానికి రాజమౌళి బృందం శ్రమిస్తోంది. దీని తర్వాత కొన్ని రోజుల వ్యవధిలో ఆడియో వేడుక నిర్వహించనున్నారు.
9. బాహుబలి పెద్ద పండుగవేసవి సెలవుల్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా బాహుబలి -2 ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆరోజు మరో పెద్ద పండుగ కానుంది.
10. ఎప్పటికీ అలరించే బాహుబలిబాహుబలి బిగినింగ్ తో మొదలైన మహిస్మతి రాజ్యం బాహుబలి కంక్లూజన్ తో ముగిసిపోదు. ఎప్పటికీ అలరించేలా బాహుబలి బృందం ప్లాన్ చేసింది. “బాహుబలి : ద లాస్ట్ లెజెండ్స్” పేరిట యానిమేటెడ్ చిన్న చిత్రాలను రూపొందించింది. గ్రాఫిక్ ఇండియా, ఆర్కా మీడియా, అమెజాన్ ప్రైమ్ వీడియో తో కలిసి రాజమౌళి నిర్మించిన ఈ సీరీస్ ని వచ్చే ఏడాది ఒక్కొక్కటిగా ఆన్ లైన్లో రిలీజ్ చేయనున్నారు. మహిస్మతి రాజ్యంలో జరిగే అన్ని సంఘటనలను చిన్న కథల రూపంలో చూపించనున్నారు. 2017 లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేశారు.