ప్రపంచ అభిమానుల మనసు దోచుకున్న ‘బాహుబలి’ కి అంతం ఉండదని ఆ పాత్రను సృష్టించిన రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇప్పటికే ‘బాహుబలి – బ్యాటిల్ ఆఫ్ ది బోల్డ్’ పేరుతో కామిక్ బుక్ ని రూపొందించి అందుబాటులోకి తీసుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ‘బాహుబలి’ చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ తో కలిసి గ్రాఫిక్ ఇండియా సంస్థ ఈ పుస్తకాన్ని ముద్రిస్తోంది. బాహుబలి కంక్లూజన్ విడుదల అయిన తర్వాత కామిక్ పుస్తకాలు రిలీజ్ చేయనున్నారు. ఇవి దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇప్పుడు బాహుబలిని సీరియల్ గా తీయడానికి పనులు సాగుతున్నాయి. ఇంగ్లిష్ లో వస్తోన్న “గేమ్ అఫ్ థ్రోన్స్” మాదిరిగా సిరీస్ రూపంలో తీసుకొచ్చేందుకు విజయేంద్ర ప్రసాద్ కథను విస్తరిస్తున్నారు.
“బాహుబలి 1 , బాహుబలి 2 చిత్రాలకు సంబంధించి అన్ని పనులు పూర్తి అయ్యాయి. ఇప్పుడు సీరియల్ కోసం పాత్రలను లోతుగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. యాక్షన్ తో పాటు ఎక్కువగా డ్రామా ఉండాలని ఆలోచనతో తీరిక లేకుండా రాస్తున్నాను. కథ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత నిర్మాత, దర్శకుల వివరాలు బయటకి వెల్లడిస్తాం” అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఒక్కో సీజన్ కి 40 నుంచి 50 ఎపిసోడ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం టీవీలో చిన్న కథనే పదేళ్లు పాటు సాగదీస్తున్నారు. మరి మూడు తరాల స్టోరీ అయిన బాహుబలి ఎన్నేళ్లు ప్రసారం కానుందో ఇప్పట్లో చెప్పడం కష్టమే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.