కొన్నాళ్లుగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తరచూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. ఇటీవల చూసుకుంటే.. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ (Adhurs) విలన్ ముకుల్ దేవ్ (Mukul Dev) వంటి వారు మరణించారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే…
మరో సీనియర్ నటుడు మృతి చెందడం అనేది అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ‘బలగం’ (Balagam) నటుడు జీవీ బాబు (GV Babu) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన.. వరంగల్ లోని ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు వేణు ఎల్దిండి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘జీవి బాబు ఇక లేరు. ఆయన జీవితం మొత్తం నాటకరంగంలో సాగింది.
ఆయన చివరి రోజుల్లో ‘బలగం’ తో ఆయన్ని సినిమా రంగానికి పరిచయం చేయడం అనేది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ పేర్కొన్నారు వేణు. ‘బలగం’ సినిమాలో చిన తాత పాత్రలో జీవి బాబు నటించారు. హీరో తండ్రి, మామ గొడవ పడుతుంటే.. మధ్యలో ఆపి మందలించే వ్యక్తిగా ఈయన సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కనిపిస్తారు.