సినిమా విజయం సాధిస్తే ఒక్కసారి ఆ ఆనందాన్ని జరుపుకోవడం ఓల్డ్ ఫ్యాషన్. నెలకోసారి, వారానికోసారి, కుదిరితే మూడు రోజులకోసారి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. సినిమా విజయం ఎంత పెద్దదైతే అన్ని ఉత్సవాలు కొందరు జరుపుకుంటే… సినిమాను హిట్ చేయడానికే కొందరు జరుపుకుంటారు అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా ‘భగవంత్ కేసరి’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఇటీవల జరిగాయి. అందరికీ జ్ఞాపికలు ఇచ్చి మీర విజయోత్సవం జరుపుకున్నారు. ఈ క్రమంలో హీరో బాలకృష్ణ మాట్లాడుతూ సినిమాలో తన పాత్ర గురించి, తెలుగు వారి సత్తా గురించి మాట్లాడారు.
దీంతో ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అలాగే పరిశ్రమ గురించి, ప్రేక్షకుల గురించి కూడా మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది. కొత్తదనాన్ని కోరుకుంటారు. మనం ముందడుగు వేసి కొత్త తరహా సినిమాలు చేస్తే మంచి ఫలితం వస్తుంది. దానికి ఓ ఉదాహణ ‘భగవంత్ కేసరి’ అని చెప్పారు బాలకృష్ణ. ‘భగవంత్ కేసరి’ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమా కోసం హిందీలో డబ్బింగ్ చెప్పను అని (Balakrishna) బాలయ్య తెలిపారు. హిందీలో డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలా ఎందుకు అనే ప్రశ్న మీకు వచ్చింది అంటే… పై మాటకు వెంటనే బాలయ్య చెప్పిన ‘ప్రయోగం చేయడం నాన్న నుండి నాకు వచ్చిన అలవాటు’ అనే మాట చెప్పాల్సిందే. ఇక ఈ సినిమా తెలుగువాళ్ల సత్తా మరోమారు నిరూపిస్తుంది అని బాలయ్య చెప్పారు.
వైవిధ్యమైన పాత్రల్ని చేసే దమ్ము, ధైర్యం, నమ్మకం మా నాన్న నుండి వచ్చిన వారసత్వం అని చెప్పారు బాలయ్య. బాలకృష్ణ సినిమా అంటే వేరు. షడ్రుచులు ఉండాలి అని అనుకుంటూ ఉంటాను. అనిల్ రావిపూడి ఒక మంచి సందేశం ఇస్తున్నాం అంటూ ఈ కథ చెప్పారు. ఆయన ఆలోచన, కథ నచ్చి ఓకే చెప్పాను. అందుకే చిచ్చాగా నటించాను అని పాత్రను ఒప్పుకోవడం వెనుక కారణం చెప్పారు.