ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని ఆకాశానికెత్తేసిన కొందరు రివ్యూ రైటర్స్ కూడా సినిమా మొత్తానికి మైనస్ గా ఫీలైన అంశం.. యంగ్ రామారావు పాత్రలో బాలయ్య కనిపించడమే. ఈ విషయాన్ని నందమూరి అభిమానులు కూడా ఒప్పుకున్నారు. యంగ్ రామారావుగా శర్వానంద్ లేదా జూనియర్ ఎన్టీఆర్ చేసి ఉంటే బాగుండేదని ఆల్మోస్ట్ అందరూ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల సమయంలో పెద్దగా పట్టించుకోని బాలయ్య.. రిజల్ట్ వచ్చిన తర్వాత సీరియస్ గా తీసుకొన్నట్లున్నాడు.
అందుకే “ఎన్టీఆర్ మహానాయకుడు” స్క్రీన్ ప్లేలో చిన్న చిన్న మార్పులు చేసి యంగ్ ఎన్టీఆర్ మరియు యంగ్ బసవతారకంలా ఇద్దరు జూనియర్స్ ను తీసుకొన్నాడట. వాళ్ళ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. జూనియర్ బసవతారకంలా గ్రీష్మ అనే చైల్డ్ ఆర్టిస్ట్ ను సెలక్ట్ చేశారు. వందేమాతరం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “అమ్ములు” చిత్రంతో వెండితెరకు పరిచయమైన గ్రీష్మ నీహారిక అనంతరం “మల్లీశ్వరి, ప్రస్థానం” వంటి సినిమాల్లోనూ నటించింది. అలాగే యంగ్ రామారావుగా బెంగుళూరుకు చెందిన తరుణ్ అనే మరో యువకుడు కనిపించనున్నాడు. ఇటీవలే వీరిద్దరి నడుమ సన్నివేశాలను రామోజీ ఫిలిమ్ సిటీలో తెరకెక్కించారు. “లవ్ యూ బంగారం” చిత్రంతో కథానాయికగా పరిచయమైన శ్రావ్యకి గ్రీష్మ చెల్లెలు కావడం విశేషం. త్వరలోనే ఈ అమ్మడు పూర్తిస్థాయి కథానాయికగా పరిచయమయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.