Balakrishna: ఆ విషయాల గురించి బాలయ్య క్లారిటీ ఇస్తారా?

స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ కాంబోలో తొలి సినిమా కాగా బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు టైటిల్ ను కూడా ప్రకటించలేదు. అయితే జూన్ నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.

Click Here To Watch NOW

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ కు సంబంధించిన ప్రకటనతో కూడిన టీజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. టీజర్ లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ప్రకటన వెలువడనుందని బోగట్టా. బాలయ్య ఈ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించాల్సి ఉంది. ఊరమాస్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని సమాచారం. బాలయ్య తర్వాత సినిమాలతో కూడా వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య పుట్టినరోజున కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి కూడా క్లారిటీ ఇస్తారని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. బాలయ్య రెమ్యునరేషన్ కూడా తక్కువే కావడంతో ఆయనతో సినిమాలను నిర్మించాలని ఆసక్తి చూపుతున్న నిర్మాతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య సైతం అఖండ సక్సెస్ కెరీర్ కు ఉపయోగపడాలని భావిస్తున్నారని బోగట్టా. బాలయ్య కొత్త ప్రాజెక్ట్ లకు కూడా అనుభవం ఉన్న డైరెక్టర్లను ఎంపిక చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్యతో పని చేయడానికి సీనియర్ డైరెక్టర్లతో పాటు యంగ్ జనరేషన్ డైరెక్టర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

బాలయ్య ఎంతమంది డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తారో చూడాల్సి ఉంది. బాలయ్య మాస్ సినిమాలలో నటించడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనుండగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus