Balakrishna: బాలయ్య కొత్త మూవీ టైటిల్ ఇదే.. కానీ?

స్టార్ హీరో బాలకృష్ణ సినిమాలకు పవర్ ఫుల్ టైటిల్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే. టైటిల్స్ వల్లే బాలయ్య సినిమాలలో పలు సినిమాలకు క్రేజ్ ఏర్పడింది. బాలయ్య సినిమా టైటిల్స్ లో సింహా అని ఉంటే ఆ సినిమా సక్సెస్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. బాలయ్య నటించిన అన్ని సినిమాలు కాకపోయినా సింహా టైటిల్ తో తెరకెక్కిన మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. మరోవైపు బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో సమరసింహారెడ్డి కూడా ఒకటి.

Click Here To Watch

ఈ రెండు సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో సినిమాకు వీరసింహారెడ్డి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సినిమాలో బాలయ్య పాత్ర పేరు కూడా వీరసింహారెడ్డి అని సమాచారం. మేకర్స్ స్పందిస్తే ఈ టైటిల్ గురించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజాలు తెలిసే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ సినిమా కన్నడలో సక్సెస్ సాధించిన మఫ్టీ సినిమాకు రీమేక్ అని ప్రచారం జరుగుతుండగా యూనిట్ వర్గాలు మాత్రం ఆ ప్రచారంలో నిజం లేదని చెబుతున్నాయి.

ఈ సినిమా నుంచి లీకైన బాలయ్య లుక్ మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఖాతాలో వేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుండగా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాతో తెరకెక్కనుంది. అయితే మేకర్స్ ఈ సినిమా నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా జాగ్రత్త వహించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బాలయ్యకు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా ఆమె పాత్ర గమ్మత్తుగా ఉంటుందని సమాచారం అందుతోంది. బాలయ్య సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus