‘జైలర్ 2’ కోసం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే షూటింగ్ మొదలైంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మోహన్‌లాల్ ప్రస్తుతం చాలా బిజీ. మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అయినప్పటికీ మిగిలిన భాషల్లో కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ‘కన్నప్ప’ వంటి సినిమాల్లో ఆయన పాత్రలు మెప్పించాయి.
త్వరలో ‘దృశ్యం 3’ షూటింగ్ లో కూడా జాయిన్ అవుతారు. ఈ గ్యాప్ లో ‘జైలర్ 2’ సినిమాలో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు. నిన్ననే ఆయన సెట్స్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. జూలై నెలాఖరుకి మోహన్ లాల్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మరో స్టార్ పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేయాలని దర్శకుడు నెల్సన్ భావిస్తున్నారు.
అది టాలీవుడ్ స్టార్ బాలకృష్ణ (Balakrishna) రోల్ అనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ‘జైలర్ 2’ నందమూరి బాలకృష్ణ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషించనున్నారు. సినిమాలో దాదాపు 10- 15 నిమిషాలు కనిపించే పాత్ర అది. దీని కోసం బాలయ్య రూ.20 కోట్లు పారితోషికం అందుకోనున్నారు అనే టాక్ ఇటీవల నడిచింది. వాస్తవానికి మొదటి భాగం అంటే ‘జైలర్’ లోనే బాలయ్య కామియో ఉండాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను స్క్రిప్ట్ దశలోనే తీసేసినట్టు దర్శకుడు నెల్సన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
పార్ట్ 2 ని మాత్రం నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేయడంతో టాలీవుడ్ నుండి ఒక స్టార్ గా బాలయ్యని తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ 2’ షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. ఈ నెలాఖరుకి బాలకృష్ణ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది అని వినికిడి. సో నెక్స్ట్ మంత్ ‘జైలర్ 2’ కోసం బాలయ్య డేట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.