NBK107: ఆ టైటిల్ బాగుందంటున్న నందమూరి ఫ్యాన్స్!

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమా అంటే టైటిల్ పవర్ ఫుల్ గా ఉండాలనే సంగతి తెలిసిందే. బాలయ్య ప్రతి సినిమా టైటిల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీకి సంబంధించి వేర్వేరు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. రౌడీయిజం, జై బాలయ్య, వీరసింహారెడ్డి, మరికొన్ని టైటిల్స్ ఈ సినిమాకు సంబంధించి వినిపించాయి. ఈ టైటిల్స్ బాగానే ఉన్నా మేకర్స్ మాత్రం ఈ టైటిల్స్ గురించి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ఈ సినిమా మేకర్స్ తాజాగా ఈ సినిమాకు అన్నగారు అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అటు సినీ అభిమానులు, ఇటు రాజకీయ అభిమానులు సీనియర్ ఎన్టీఆర్ ను అన్నగారు అని పిలిచేవారు. బాలయ్య సినిమాకు ఇదే టైటిల్ గా ఫిక్స్ అయితే బాగుంటుందని నందమూరి అభిమానులు సైతం చెబుతున్నారు. త్వరలో ఈ టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

దర్శకుడు గోపీచంద్ మలినెని ఈ సినిమాలో బాలయ్యను ఏ విధంగా చూపించబోతున్నారో ఇప్పటికే విడుదలైన పోస్టర్ల ద్వారా ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. బాలయ్య శృతి హాసన్ కాంబో సీన్లు ఈ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది. శృతి ఈ సినిమా కోసం ఏకంగా 2.5 కోట్ల రూపాయల మొత్తాన్ని రెమ్యునరేషన్ గా అందుకున్నారని తెలుస్తోంది. సీనియర్ హీరోలకు జోడీగా వరుస ఆఫర్లను పొందుతూ శృతి హాసన్ ఈ మొత్తాన్ని పారితోషికంగా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

సెకండ్ ఇన్నింగ్స్ లో శృతి హాసన్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. క్రాక్ సక్సెస్ కూడా శృతి కెరీర్ కు కొంతమేర ఉపయోగపడిందని తెలుస్తోంది. శృతి మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండటం గమనార్హం. బాలయ్య శృతి కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus