రేంజ్ కి తగిన పారితోషికం అందుకోనున్న బాలకృష్ణ
- February 11, 2017 / 10:51 AM ISTByFilmy Focus
కథ నచ్చితే ఒకే చెప్పడం .. చకచకా షూటింగ్ చేసేయడం నందమూరి బాలకృష్ణకు మొదటి నుంచి అలవాటు. సినిమా ప్రారంభం ముందు రెమ్యునరేషన్స్ గురించి.. చిత్రం విడుదలయిన తర్వాత కలక్షన్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. అందుకే ఇంతవరకు ఆయన తన పారితోషికంపై దృష్టి పెట్టలేదు. మొన్నటికి మొన్న పరిశ్రమలోకి అడుగుపెట్టిన వారు కూడా కోట్లు డిమాండ్ చేస్తున్నా.. బాలయ్య రెమ్యునరేషన్ వద్ద డిమాండ్ చేయలేదు. క్రిష్ దర్శకత్వంలో ఆయన చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కలక్షన్ల వర్షం కురిపించింది. ఓవర్ సీస్ లోను భారీగా డాలర్లు వసూలు చేసింది. దీంతో బాలకృష్ణతో సినిమా చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. పదిహేను కోట్లు, ఇరవై కోట్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
అయినా ఇప్పుడున్న క్రేజ్ ని సొంతం చేసుకోవాలని ఆయన అనుకోలేదు. వంద చిత్రాల మైలు రాయిని క్రాస్ చేసిన సందర్భం గా గౌరవప్రదమైన పారితోషికం అందుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఏడు కోట్లు తీసుకున్న బాలయ్య మరో మూడు కోట్లు పెంచి పది కోట్లకు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలను చేసే ఆలోచనలో ఉన్నారు. వీటిలో ఏది ముందు సెట్స్ మీదకు వెళుతుందో ఇప్పుడే చెప్పలేం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















