Balakrishna New Car: బాలయ్యకు గిఫ్ట్ గా లగ్జరీ కారు.. ఎవరిచ్చారంటే?

స్టార్ హీరో బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బుల్లితెర షోలకు దూరంగా ఉన్న బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ టాక్ షోకు హోస్ట్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతేడాది సమంత హోస్ట్ గా సామ్ జామ్ పేరుతో ప్రసారమైన టాక్ షో ప్రేక్షకులను ఆకట్టుకోగా ఆహా నిర్వాహకులు ఈ ఏడాది కూడా అలాంటి టాక్ షోను ప్లాన్ చేశారు. వెండితెరపై సినిమాల ద్వారా ఎన్నో సంచలనాలు సృష్టించిన బాలకృష్ణ స్మాల్ స్క్రీన్ పై అద్భుతాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

అయితే ఈ షో ప్రారంభ కార్యక్రమానికి బాలకృష్ణ లగ్జరీ కారులో వచ్చారు. ఖరీదైన బెంట్లీ కారులో బాలయ్య ఈ షో ఈవెంట్ కు రాగా బాలయ్య వచ్చిన లగ్జరీ కారు గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాలకృష్ణ పెద్ద కూతురు నారా బ్రాహ్మణి ఈ కారును బాలయ్యకు బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. ఈ కారు విలువ 4 కోట్ల రూపాయలు అని సమాచారం. అన్ స్టాపబుల్ టాక్ షో పది ఎపిసోడ్లుగా ప్రసారం కానుందని తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ టాక్ షోకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించి కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ జరిగిందని సమాచారం. బాలయ్య ఈ షో కోసం భారీస్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు బాలకృష్ణ వచ్చే నెల నుంచి గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ప్రస్తుతం బాలయ్య నటించిన అఖండ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Share.