నందమూరి బాలకృష్ణ ఓ పక్క వరుస సినిమాలు చేస్తూనే మరో పక్క హిందూపురం ఎం.ఎల్.ఎ గా.. అలాగే బసవతారకం ఆస్పత్రికి సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతూ ఉంటారు. అలాంటి బాలయ్య ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో చేసి దేశమంతా పాపులర్ అయ్యాడు. ‘ఆహా’ వారు బాలయ్య లోని మరో కోణాన్ని బయట పెట్టి.. ఆయన పేరు దేశమంతా మార్మోగేలా చేశారు. ఇదిలా ఉండగా.. ఓ పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినా బాలయ్య పారితోషికం పెంచాలని డిమాండ్ చేసింది లేదు.
తన తండ్రి నందమూరి తారక రామారావు గారిలా దర్శకనిర్మాతలకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో పారితోషికం ఎక్కువ కావాలని డిమాండ్ చేయలేదు. నందమూరి తారక రామారావు గారు కూడా బాలకృష్ణ కి ఇదే మాట పదే పదే చెప్పేవారని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఇదిలా ఉండగా.. ‘ఆహా’ విషయంలో కూడా ఆయన అదే చేశారు. ‘అన్ స్టాపబుల్’ మొత్తం 10 ఎపిసోడ్లతో ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అయ్యింది.
దీనికి బాలయ్య పారితోషికం కేవలం రూ.1 కోటి మాత్రమే అని ఇన్సైడ్ సర్కిల్స్ సమాచారం. అయితే మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది కాబట్టి.. రెండో సీజన్ కు పారితోషికం పెంచారని వినికిడి. అందుతున్న సమాచారం ప్రకారం… ఒక్కో ఎపిసోడ్ కు గాను బాలయ్య రూ.25 లక్షల వరకు అందుకోబోతున్నారట. ఈసారి ఎన్ని ఎపిసోడ్ లు ఉండబోతున్నాయి అనే విషయం ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ 10 ఎపిసోడ్లు కనుక ఉంటే ఆయనకి రూ.2.5 కోట్ల వరకు అందుతుంది అని తెలుస్తుంది.