నందమూరి బాలకృష్ణ 99.చిత్రాలు పూర్తి చేసుకుని తన వందో చిత్రంలోకి అడుగు పెట్టేశాడు. తన వందో చిత్రాన్ని చారిత్రాత్మక చిత్రంగా ఎన్నుకోవాలన్న ఆలోచనలో ఉన్న బాలయ్య క్రిష్ చెప్పిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ కధకు ఫిదా అయిపోయాడు. ఇక ఈ చిత్రాన్ని ఆంధ్రుల రాజధాని అమరావతిలో వెల్లడించిన బాలయ్య ఈ చిత్రం యొక్క ముహూర్తపు షాట్ ని హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోస్ లో అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఇక అతిరధ మహారధులు అందరి సమక్షంలో ఈ చిత్రం ప్రారంభం అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇదే క్రమంలో తన 100వ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలయ్య, తన కెరీర్ లో ఈ చిత్రం మరుపురాని మైలురాయిగా నిలిచిపోయేందుకు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇక అదే క్రమంలో నిన్న విడుదలైన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా లోగో చూస్తుంటేనే అర్ధం అవుతుంది ఈ సినిమా ఎంతటి హిస్టారికల్ చిత్రంగా నిలిచిపోతుందో అని. ఇక అంతటి భారీ చిత్రానికి సంగీతం అందించేది ఎవరు అన్న ఆలోచన సైతం అందరికీ కలుగుతుంది. ఇదే క్రమంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ ఇప్పటికే తాను అనుకున్నసంగీత దర్శకులను బాలకృష్ణకు ఇంట్రడ్యూస్ చేశారట. కానీ బాలకృష్ణ మాత్రం వాళ్ళని కాదని ఒకే ఒక్కరికి ఓటు వేసినట్లు తెలుస్తుంది..ఇంతకీ బాలయ్య మెచ్చిన ఆ సంగీత దర్శకులు ఎవరా అనుకుంటున్నారా..! బాలకృష్ణ కెరీర్ లో రికార్డు మోత మోగించిన చిత్రం ‘లెజెండ్’…ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన దేవీశ్రీ ప్రసాద్ కే ఓటు వేశారట. ఇక క్రిష్ కూడా బాలయ్య మాటకు ఒకే చెప్పడంటా. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే…కమర్షియల్ మ్యూజిక్ దర్శకుడిగా మంచి పేరు ఉన్న దేవి, ఇలాంటి హిస్టారికల్ సినిమా చేయడం మొదటిసారి కావడం, అది ఎంతవరకూ సక్సెస్ చేయగలడో అన్న సందిగ్ధం మొదలయ్యింది. చూద్దాం ఏం జరుగుతుందో.