బోయపాటి డైరెక్షన్లో బాలయ్య,బన్నీ ల మల్టీ స్టారర్..?

ఈ మధ్యనే రాజమౌళి ‘RRR’ ను పూర్తిచేసాడు. విడుదల చేద్దాం అనుకున్న టైములో ఓ పక్క కరోనా ఇంకో పక్క ఏపి ప్రభుత్వం అడ్డుపడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇది పక్కన పెడితే.. ‘RRR’ అంటే రాజమౌళి, రామారావు,రాంచరణ్ అని సింబాలిక్ గా చెబుతూ మొదటి నుండీ ఆ సినిమాకి భారీ హైప్ ను తీసుకొచ్చారు. త్వరలోనే ‘BBB’ కూడా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్.

‘BBB’ అంటే బోయపాటి, బాలయ్య, బన్నీ అన్న మాట. ఈ మధ్యకాలంలో బాలయ్య..’గీతా ఆర్ట్స్’ కి బాగా దగ్గరయ్యాడు. ‘ఆహా’ కోసం ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్ గా కూడా వ్యవహరించాడు. ఈ టాక్ షో సౌత్ తో పాటు నార్త్ లో కూడా సరికొత్త రికార్డ్ సృష్టించింది. అంతేకాదు ‘అఖండ’ ప్రమోషన్లలో బన్నీ, ‘పుష్ప’ ప్రమోషన్లలో బాలయ్య కూడా హల్ చల్ చేశారు. ఇప్పుడు వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందనే వార్తలు రావడం సహజమే అని అంతా అనుకోవచ్చు.

అయితే ఇక్కడ ఇంకాస్త డెప్త్ కు వెళ్తే.. బోయపాటి నెక్స్ట్ సినిమా బన్నీతో చేయబోతున్నాడు అనేది చాలా వరకు ఖరారు అయిన వార్త. ఇది ఒక మల్టీస్టారర్ స్క్రిప్ట్ అనేది తాజా సమాచారం. బోయపాటి – బాలయ్య ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. దీనికి తిరుగులేదు అని ప్రూవ్ అయ్యింది. ఇక ‘సరైనోడు’ తో బన్నీ మాస్ ఇమేజ్ ను బలపడేలా చేసింది కూడా బోయపాటినే..! కాబట్టి ఈ కాంబినేషన్లో సినిమా పడితే ఎన్ని రికార్డులు కొడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ మధ్యనే ‘ఇక్కడ ఇది జరుగుద్ది అని లేదు.. ఇక్కడ ఇది జరగదు అని కూడా ఏమీ లేదు’ అంటూ బోయపాటి ఈ విషయం పై ఇండైరెక్ట్ గా స్పందించాడు. కాబట్టి.. ఈ ప్రాజెక్టు సెట్ అవ్వుద్దేమో చూద్దాం..!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Share.