మరో ట్రెండ్ కి బాలయ్య శ్రీకారం చుడుతున్నాడా??
- March 12, 2017 / 03:07 PM ISTByFilmy Focus
నందమూరి నట సింహం రేంజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….అయితే ఎవరికైనా లైఫ్ ఇవ్వడంలో ఆయన ట్రాకే సేపరేటు…ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య తన 100చిత్రాలను ఘనంగా పూర్తి చేసుకుని…..దూకుడు మీద ఉన్నాడు….అదే దూకుడుతో తన 101వ సినిమాని ముందుకు తీసుకెళ్లేందుకు పక్కా వ్యూహంతో దూసుకెళ్తున్నాడు…విషయంలోకి వెళితే….బాలకృష్ణ తన 101వ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించడం ఒక సంచలనం అని అందరికీ తెలిసిన విషయమే….అయితే ఇదే మూవీలో మరొక సంచలనానికి దర్శకుడు పూరి రంగం సిద్ధం చేస్తున్నాడు.
ఇంతకీ ఏంటి ఆ సంచలనం అంటే…ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం పూరి ఈ మూవీకి సంబంధించి బాలకృష్ణకు విలన్ గా సుధీర్ బాబును ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హీరోగా సుధీర్ బాబు నటించిన సినిమాలలో మహేష్ బావగా అతడికి గుర్తింపు వచ్చింది కాని సరైన విజయం ఇప్పటి వరకు సుదీర్ బాబును పలకరించలేదు. అయితే గత సంవత్సరం బాలీవుడ్ మూవీ ‘బాఘీ’ లో టైగర్ ష్రాఫ్ కు విలన్ గా నటించాడు. ఈ మూవీలో అతడి నటనకు మంచి పేరు కూడ వచ్చింది. అయితే ఆ తరువాత కూడ సుదీర్ బాబు గురించి టాలీవుడ్ బాలీవుడ్ లు పెద్దగ పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థుతులలో బాలకృష్ణ 101వ సినిమాకు పూరి సుదీర్ ను ఎంపిక చేయడమే కాకుండా ఈ కాంబినేషన్ కు పూరి బాలకృష్ణను ఒప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ తతంగం అంతా చూసుంటే….మనం మరచిపోలేని విషయం తెలుసుగా….‘లెజెండ్’ సినిమాలో బాలయ్య జగపతి బాబుకు విలన్ గా లిఫ్ట్ ఇచ్చి తన కరియర్ కి ఒక సూపర్ టర్న్ ఇచ్చాడు….అదే క్రమంలో ఇప్పుడు సుధీర్ కి కూడా సూపర్ టర్న్ ఇచ్చేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు పోతున్నాడు….మొత్తంగా చూస్తుంటే….బాలయ్య….ఇలా బాలయ్య ఇన్‌డైరెక్ట్ గా లైఫ్ ఇస్తున్నాడన్న మాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















