బంద్‌ విషయంలో హీరోల రియాక్షన్‌ ఇదేనా?

బంద్‌ అనుకుంటున్నాం.. బంద్‌ చేస్తాం.. బంద్‌ చేసేస్తున్నాం.. బంద్‌కి రెడీ.. బంద్‌ చేయాల్సిందే.. బంద్‌ చేసి తీరుతాం.. బంద్‌ చేస్తున్నాం.. బంద్‌ మొదలైంది! ఇలా నిన్న మొన్నటివరకు ‘బంద్‌’ జపం చేసిన టాలీవుడ్‌ నిర్మాతలు ఇప్పుడు మాట మార్చారా? వారి మాటలు వింటుంటే అదే అనిపిస్తోంది. నిన్నమొన్నటివరకు బంద్‌ బంద్‌ అంటూ గట్టిగా ఉన్న యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఇప్పుడు ఇది బంద్‌ కాని బంద్‌. విరామం లాంటిది అంటున్నారట.

సినిమా పరిశ్రమలో బంద్‌లు అంటే కార్మికులు చేస్తూ ఉంటారు. లేదంటే థియేటర్ల వాళ్లు, ప్రదర్శనకారులు చేస్తుంటారు. కానీ నిర్మాతలే ముందుకొచ్చి మేం సినిమాలు చేయం అని ఆపేశారు. అలా అని అందరూ ఆపేశారా? అంటే లొసుగులు మాట్లాడుతూ కొన్ని సినిమాల షూటింగ్‌లు అవుతున్నాయి. దీంతో నిర్మాతల మధ్య యూనిటీ దెబ్బతింది అని అంటున్నారు. మరోవైపు హీరోలు కూడా సినిమా షూటింగ్‌లు స్టార్ట్‌ చేయాల్సిందే అంటున్నారట. డేట్స్‌ సమస్యలు వస్తాయనేది వారి ఉద్దేశం.

దసరా, ఇయర్‌ ఎండ్‌, సంక్రాంతి అంటూ కొన్ని సినిమాలు ముందుగానే డేట్లు అనుకున్నాయి. వాటి షూటింగే ఇప్పుడు ఆగిపోయింది. ఆ సీజన్లు మిస్‌ అవ్వకూడదంటే వెంటనే షూటింగ్‌లు స్టార్ట్‌ అవ్వాలి. ఆ తర్వాత అనుకున్న సినిమాలు స్టార్ట్‌ చేయాలి. అందుకే హీరోలు ‘వెంటనే స్టార్ట్‌ చేయండి’ అంటున్నారట. మరోవైపు దర్శకుల పరిస్థితి కూడా ఇదే. సినిమా స్టార్ట్‌ చేయకుండా ఉన్న వాళ్లు మాత్రం కామ్‌గా ఉన్నారట.

నిర్మాతల నిర్ణయం పట్ల నాని గుర్రుగా ఉన్నాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. ‘దసరా’ సినిమా కొత్త షెడ్యూల్‌ వెంటనే మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. సోమవారం నుండే చిత్రీకరణ ఉంటుందని చెప్పారు. మరోవైపు బాలకృష్ణ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారట. గోపీచంద్‌ మలినేని సినిమా కొత్త షెడ్యూల్‌ వీలైనంత త్వరగా స్టార్ట్‌ చేయాలని అంటున్నారు. ఈ సినిమా పూర్తి చేసి ఆయన అనిల్‌ రావిపూడి సినిమా షురూ చేయాల్సి ఉంది.

దీంతో నిర్మాతలు కూడా ఆలోచనలో పడ్డారని అంటున్నారు. బంద్‌ కాదు, విరామం అంటూ ఆలోచన మార్చింది కూడా ఇందుకే అని చెబుతున్నారు. విరామం అంటే ఎప్పుడైనా, ఎవరైనా తమ పని స్టార్ట్‌ చేయొచ్చు. హీరోల ఒత్తిడి కారణంగానే బంద్‌ కాస్త విరామంగా మారింది అని చెప్పుకోవచ్చు. చూద్దాం ఆదివారం సాయంత్రానికి ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Share.