Balayya Babu,Shruti Haasan: మేమిద్దరం హాట్ పేరు ఆఫ్ ఏపీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య!

బాలయ్య వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాలకృష్ణ పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో కలిసి ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్స్ అయినటువంటి జయప్రద జయసుధ అలాగే యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా ముగ్గురు హీరోయిన్లు హాజరయ్యారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య చేసిన హంగామా మామూలుగా లేదని చెప్పాలి.

తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ తన సహా నటీమణులతో కలిసి డ్యాన్సులు చేయడమే కాకుండా ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాశిఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి ఏ సందేహం లేదు అనే పాట పాడి అందరిని మెప్పించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో తాను శృతిహాసన్ హాట్ పేరు ఆఫ్ ఏపీ అంటూ శృతిహాసన్ తో తన జోడి గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ నవ్వులు పూయించారు.

బాలకృష్ణ ఇలా మాట్లాడటంతో జయప్రద జయసుధ ఫీలింగ్స్ మొత్తం మారిపోయాయి. ఇక యంగ్ హీరోయిన్ రాశి కన్నా నవ్వుకు తాను పడిపోయానని బాలకృష్ణ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ముగ్గురు హీరోయిన్లను పలు ప్రశ్నలు కూడా వేశారు.ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే కొన్ని విషయాలలో రాజీ పడక తప్పదు నిజమా కాదా అని ప్రశ్నించడంతో ఈ ముగ్గురు కూడా నిజమేనంటూ సమాధానం చెప్పారు.మొత్తానికి ఈ ముగ్గురితో కలిసి బాలయ్య ప్రేక్షకులను భారీగా ఎంటర్టైన్ చేయబోతున్నారని తెలుస్తోంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus