Balakrishna: ఆ ఫ్లాప్ డైరెక్టర్ తో బాలయ్య మళ్ళీ సినిమా చేస్తాడా..!

నందమూరి బాలకృష్ణ పనైపోయింది అనుకున్న టైంలో బోయపాటి శ్రీను సింహా, లెజెండ్ , అఖండ వంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చి.. ఆయన బాక్సాఫీస్ స్టామినా ఏంటనేది రుచి చూపించాడు. బాలయ్య కి ఉన్న మాస్ ఇమేజ్ ఏంటనేది కూడా ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి. అప్పటి నుండి బాలయ్యతో సినిమాలు చేయడానికి యంగ్ డైరెక్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సీనియర్ హీరోలందరి కంటే బాలయ్య.. చాలా డెడికేటెడ్ గా వ్యవహరిస్తాడు.

ఫాస్ట్ గా సినిమాలు పూర్తి చేయడానికి సహకరిస్తాడు. మేకింగ్ కాస్ట్ అస్సలు పెరగనివ్వడు. అందుకే బాలయ్యతో సినిమా చేయడానికి నిర్మాతలు కూడా వెనకడుగు వేయరు. సితార ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , దిల్ రాజు , గీతా ఆర్ట్స్ సంస్థలు కూడా ఇప్పుడు బాలయ్యతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాయి. బాలయ్యతో సినిమా చేయాలని యంగ్ డైరెక్టర్స్ చాలా మంది ఎదురుచూస్తున్నారు. కాకపోతే బాలయ్య మాత్రం తనకు ఓ ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ తో మళ్లీ సినిమా చేయాలని చూస్తున్నాడట.

శ్రీవాస్ ప్రస్తుతం గోపీచంద్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక బాలయ్యతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆల్రెడీ ఓ కథ బాలయ్యకు వినిపించాడు. అది బాలయ్యకు నచ్చింది. గోపీచంద్ సినిమా పూర్తయ్యాక అతను బాలయ్యతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో డిక్టేటర్ మూవీ వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ బాలయ్యను శ్రీవాస్ అభిమానులు మెచ్చే విధంగా చూపించాడు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus