Bandla Ganesh: చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారు.. బండ్ల షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు పేరు వాడుకుని ఎంతోమంది లబ్ధి పొందారని బండ్ల గణేష్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఎంతోమంది జీవితాలను నిలబెట్టారని ఆయన కామెంట్లు చేశారు. చంద్రబాబు అరెస్ట్ కావడం ఎంతో బాధ పెట్టిందని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం వల్ల ఈసారి వినాయక చవితి వేడుకలను కూడా జరుపుకోవాలని తాను భావించడం లేదని ఆయన కామెంట్లు చేశారు. ఐటీ ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లి బొడ్రాయి ముందు కూర్చుని ధర్నాలు చేయాలని ఆయన కోరారు. చంపుతారా చంపేయాలని ఐటీ ఉద్యోగులు చెప్పాలని చంద్రబాబు జైలులో మగ్గుతుంటే అన్నం కూడా తినాలని అనిపించడం లేదని ఆయన కామెంట్లు చేశారు.

2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారని ఆయన మళ్లీ సీఎం అవుతారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. బండ్ల గణేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ నిర్మాతగా మళ్లీ కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టెంపర్ సినిమా తర్వాత బండ్ల గణేష్ సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నారు. టెంపర్ భారీ లాభాలను అందించినా వేర్వేరు కారణాల వల్ల సినీ నిర్మాణానికి దూరమయ్యారు.

బండ్ల గణేష్ (Bandla Ganesh) రాజకీయాల్లో సక్సెస్ కావాలని మరి కొందరు అభిమానులు కోరుకుంటున్నారు. తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలను రీ రిలీజ్ చేయాలని బండ్ల గణేష్ భావిస్తుండగా ఈ సినిమాలు ఎప్పుడు రీ రిలీజ్ అవుతాయో చూడాల్సి ఉంది. బండ్ల గణేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ద్వారా బండ్ల గణేష్ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus