Bandla Ganesh,Pawan Kalyan: పవన్ ను ఇబ్బంది పెట్టొద్దన్న బండ్లన్న.. ఏమైందంటే?
- August 17, 2022 / 11:30 AM ISTByFilmy Focus
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చేసే పోస్టుల గురించి ఫ్యాన్స్ మధ్య జోరుగా చర్చ జరుగుతుందనే సంగతి తెలిసిందే. పవన్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఇప్పటికే పవన్ తో రెండు సినిమాలను నిర్మించగా ఆ సినిమాలలో తీన్ మార్ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.
పవన్ తో మరో సినిమాను నిర్మించాలని బండ్ల గణేష్ ప్రయత్నాలు చేసినా పవన్ ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి పెట్టడంతో బండ్ల గణేష్ పవన్ కాంబినేషన్ లో మరో సినిమా రావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ను పవన్ తో సినిమా ఎప్పుడని ఆ సినిమా గురించి క్లారిటీ ఇవ్వాలని పవన్ తో సినిమా ఉందా లేదా అని అడిగాడు. ఆ ట్వీట్ కు బండ్ల గణేష్ వెంటనే స్పందించి సమాధానం ఇచ్చారు.

మన అభిమానం నిజమైన అభిమానం అయితే మనం నిజంగా పవన్ కళ్యాణ్ ను ప్రేమిస్తే పవన్ కళ్యాణ్ చేయబోతున్న కార్యక్రమానికి మంచి కలగాలని కోరుకుందామని బండ్ల గణేష్ తెలిపారు. సినిమా అనేది బిజినెస్ అని దయచేసి పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టవద్దని బండ్ల గణేష్ సూచనలు చేశారు. ఇది మన బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ స్థానం వేరు పవన్ కళ్యాణ్ స్థాయి వేరు అని ఆయన కామెంట్లు చేశారు.

బండ్ల గణేష్ ట్వీట్ మరింత కన్ఫ్యూజన్ కు గురి చేస్తోందని పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు పవన్ హరిహర వీరమల్లు సినిమాను సగం పూర్తి చేయగా వినోదాయ సిత్తం రీమేక్, భవదీయుడు భగత్ సింగ్ తెరకెక్కాల్సి ఉంది. పవన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ లు ఆలస్యం అవుతుండటంతో పవన్ తో సినిమాలను నిర్మించే నిర్మాతలు సైతం టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.
మనది నిజమైన అభిమానం అయితే మనం నిజంగా ఆయన ప్రేమిస్తే ఆయన చేయబోతున్న కార్యక్రమానికి కలగాలని కోరుకుందాం సినిమా వ్యాపారం ఆయన్ని దయచేసి ఇబ్బంది పెట్టకూడదు ఇది మన బాధ్యత ఆయన స్థానం వేరు ఆయన స్థాయి వేరు 🙏🔥🔥🔥🐅@PawanKalyan https://t.co/5hseS3U21W
— BANDLA GANESH. (@ganeshbandla) August 16, 2022
‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?
















