Bandla Ganesh: ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బండ్ల గణేష్‌!

మా ఎన్నికల విషయంలో ఇటీవల బండ్ల గణేష్ ఎలాంటి వ్యాఖ్యలు చేసాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాగైనా ఈసారి మా ఎన్నికల్లో గెలిచి తీరుతాను అని అందులో ఎలాంటి అనుమానం లేదని కూడా చెప్పాడు. జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ వేసిన బండ్ల గణేష్ మీడియా ముందు కూడా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. మళ్ళీ ఎన్నికల ఫలితాల రోజు కూడా సరైన సమాధానం ఇస్తానని కూడా చెప్పాడు.

అయితే ఎవరూ ఊహించని విధంగా బండ్ల గణేష్ ఈ రోజు ఉదయం మా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను.. అంటూ బండ్ల గణేష్ ట్విట్టర్లో వివరణ ఇచ్చారు.అంతేకాకుండా మా బిడ్డలం ప్యానెల్ అధ్యక్షలు ప్రకాష్ రాజ్ అలాగే హీరో శ్రీకాంత్ కూడా ప్రత్యేకంగా కలిసి మాట్లాడటం జరిగింది.

ఇంతకుముందు ప్రకాష్ రాజ్ వారి ప్యానెల్ లో జీవిత రాజశేఖర్ ను తీసుకొని జనరల్ సెక్రటరీ పదవికి పోటీకి నిలబెట్టడంపై బండ్ల గణేష్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందుకే ఇండిపెండెంట్ గా కేవలం ఆ పోస్టుకు పోటీగా నిలబడతాను అంటూ ఇన్ని రోజులు చాలెంజ్ చేశారు. అయితే సడన్ గా నేడు ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు చెప్పేశాడు. మరి ఈ విషయంలో మీడియా ఎదురైనప్పుడు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Share.