‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ విడుదలయ్యింది. సినిమాకి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి.
కానీ ఆ తర్వాత మాత్రం అదే జోరుని కొనసాగించలేకపోయింది.అయినప్పటికీ వేరే క్రేజీ సినిమాలు ఏమీ లేకపోవడంతో ‘బంగార్రాజు’ కి అడ్వాంటేజ్ అయ్యింది.దాంతో ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంది ‘బంగార్రాజు’ చిత్రం.
ఇక ఈ చిత్రం 25 డేస్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 8.48 cr |
సీడెడ్ | 7.73 cr |
ఉత్తరాంధ్ర | 5.20 cr |
ఈస్ట్ | 4.16 cr |
వెస్ట్ | 2.94 cr |
గుంటూరు | 3.60 cr |
కృష్ణా | 2.28 cr |
నెల్లూరు | 1.90 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 36.29 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.34 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 39.63 cr |
‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 25 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.39.63 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుని హిట్ గా నిలిచింది కానీ … నైజాం, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో మాత్రం ఈ మూవీ నష్టాలను మిగిల్చింది. అయితే చెప్పుకోవడానికి 2022 కి మొదటి క్లీన్ హిట్ గా ‘బంగార్రాజు’ ని చెప్పుకోవచ్చు.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!