మనోజ్ బాజ్ పాయ్ అందరికీ సుపరిచితమే.సుమంత్ హీరోగా పరిచయమవుతూ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘ప్రేమ కథ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అటు తర్వాత అల్లు అర్జున్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హ్యాపీ’ చిత్రంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అటు తర్వాత ‘వేదం’ ‘కొమరం పులి’ ‘సికందర్’ వంటి చిత్రాల్లో కూడా నటించి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎలాంటి పాత్రకైనా తన నటనతో జీవం పోసే ఇతను..
ఈ మధ్య తెలుగులో పెద్దగా నటించడం లేదు. కానీ ‘ఫ్యామిలీ మెన్’ వంటి వెబ్ సిరీస్లతో ఇక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తూనే ఉన్నాడు. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ అనే మూవీలో ఇతను లాయర్ పాత్ర పోషించాడు. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ లో మనోజ్ బాజ్ పాయ్ పోషించిన లాయర్ పాత్ర అతనికి సరికొత్త పాఠం నేర్పిందంటూ ఆసక్తికర కామెంట్లు చేశాడు. మే 23 నుండి జీ5 లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈ క్రమంగా ఏర్పాటు చేసిన ప్రమోషన్స్ లో భాగంగా (Star Actor) ఆయన మాట్లాడుతూ.. “కోర్టులో జరిగిన మోనోలాగ్ సీన్ కోసం షూటింగ్ మొదలవ్వక ముందు 100 సార్లు రిహార్సల్ చేశాను. ‘ఓ కామన్ మెన్ , అసాధారణమైన పనిచేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచే తీరును చూపించే ఈ కథ ఇది. ఎంతోమందికి ఈ పాత్ర స్ఫూర్తిగా నిలుస్తుంది.
అంతేకాదు మైనర్ బాలికపై Laiగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభావవంతమైన దైవానికి వ్యతిరేకంగా పోరాడే లాయర్ గా నటించాను. కోర్టు రూమ్ డ్రామాలో బాధితురాలి పట్ల సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నప్పుడు.. నిజంగా బాధ్యతగా ఫీల్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చాడు.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!