‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ (మా) ఎన్నికల నుండి నన్ను తప్పుకోమని చిరంజీవిగారు మా నాన్నకి ఫోన్ చేసి అడిగారు’ అంటూ ఇటీవల ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పిన విషయం తెలిసిందే. దానికి తాము అంగీకరించలేదని, పోటీలో కొనసాగుతామని చెప్పామని కూడా విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంలో నటుడు బెనర్జీ కూడా స్పందించారు. మోహన్‌బాబుకు చిరంజీవి ఫోన్ చేసింది నిజమే అనీ… అయితే జరిగిన విషయం మొత్తం విష్ణు చెప్పలేదని అన్నారు.
వచ్చే రెండేళ్లు ‘మా’ను ఎలా నడిపించానికి తన దగ్గర ఉన్న ప్రణాళికలతో ఓసారి చిరంజీవిని కలిశారు. ఆయన చెప్పిన విషయాలు, ఆలోచనలు నచ్చడంతో చిరంజీవి ఇంప్రెస్ అయ్యారని బెనర్జీ చెప్పారు. దీంతో ‘మా’ ప్రెసిడెంట్‌గా ప్రకాష్‌రాజ్ ఏకగ్రీవం అయ్యేలా చూడాలని చిరంజీవి అనుకున్నారట. ఆ విషయమ్మీద మోహన్‌బాబుతో మాట్లాడాలని కూడా నిర్ణయించుకున్నారట. ఓ రోజు ఈ విషయమ్మీద మోహన్‌బాబుకు చిరంజీవి ఫోన్ చేశారని బెనర్జీ తెలిపారు. ప్రకాశ్‌రాజ్ ఇప్పుడు ఏకగ్రీవం అయ్యేలా చేస్తే… రెండేళ్ల తర్వాత మంచు విష్ణును అధ్యక్షుడిగా నేనే ప్రపోజ్ చేస్తానని మోహన్‌బాబుకు చిరంజీవి చెప్పారని… బెనర్జీ తెలిపారు.
అయితే చిరు ప్రతిపాదనకు మోహన్‌బాబు అంగీకారం తెలపలేదట. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయని బెనర్జీ తెలిపారు. అయితే పెద్దలు వచ్చి ఏకగ్రీవం ప్రతిపాదన తెస్తే… తాను తప్పుకుంటానని విష్ణు ఆ మధ్య ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. మరి ఇలా ఎందుకు చేసినట్లో.