బాలయ్య సినిమాని విజయ్ రీమేక్ చేస్తున్నాడా.. నిజమేనా.?!

తమిళ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay)  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల టైంలోపు తాను కమిట్ అయిన సినిమాలు ఫినిష్ చేయాలని.. అతను భావిస్తున్నాడు. ఎన్నికలకు కూడా కొంత అమౌంట్ విజయ్ పార్టీకి కావాలి. అందుకోసమే అతను సినిమాలు పూర్తి చేయడానికి రెడీ అయ్యాడంటున్నారు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే విజయ్.. ఈ మధ్యనే ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (The Greatest of All Time)  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Thalapathy 69

అది అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమాని హెచ్.వినోద్ దర్శకత్వంలో చేయడానికి విజయ్ ఓకే చెప్పాడు. ‘ప్రేమలు’ (Premalu) ఫేమ్ మమితా బైజు (Mamitha Baiju) కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉంటే.. ‘దళపతి 69’ (Thalapathy 69) కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేంటంటే..దళపతి 69 ఓ తెలుగు సినిమా రీమేక్ అని టాక్ నడుస్తుంది. గతేడాది అనిల్ రావిపూడి  (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ (Nandamuri Balakrishna)  ‘భగవంత్ కేసరి'(Bhagavath Kesari) అనే సినిమా చేశాడు.

ఇందులో శ్రీలీల (Sreeleela) … బాలకృష్ణ కూతురి పాత్ర పోషించింది. బాలకృష్ణ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటి కంటే ‘భగవంత్ కేసరి’ ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే.. ఇందులో తన ఇమేజ్..కి భిన్నంగా కథ, సెంటిమెంట్.. ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదే చిత్రాన్ని విజయ్ తమిళంలో రీమేక్ చేయబోతున్నాడట.

బాలకృష్ణ ప్లేస్..లో విజయ్, కాజల్ (Kajal Aggarwal) ప్లేస్ లో పూజా హెగ్డే (Pooja Hegde) , శ్రీలీల ప్లేస్లో మమిత బైజు ఉంటారంటున్నారు.దర్శకుడు హెచ్.వినోద్ (H Vinoth) గతంలో ‘పింక్’ రీమేక్ చిత్రాన్ని రీమేక్ చేశాడు. మరి ‘భగవంత్ కేసరి’ రీమేక్ ను ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.

సమయానికి అనుగుణంగా స్పందిస్తున్న తారక్.. వాళ్లకు స్పూర్తిగా నిలుస్తూ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus