నేచురల్ స్టార్ నానికి ‘ఈగ’ తర్వాత వరుస ప్లాపులు వెంటాడాయి. ‘పైసా’ ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ ‘ఆహా కళ్యాణం’ వంటి క్రేజీ సినిమాల్లో నటించినా అవి డిజాస్టర్స్ అయ్యాయి. ఒక దశలో ‘నాని పని అయిపోయింది’ అనే కామెంట్స్ కూడా వినిపించాయి.
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం బాగానే ఆడినా.. ఆ సినిమా సక్సెస్ క్రెడిట్లో మేజర్ పార్ట్ దర్శకుడు నాగ్ అశ్విన్, విజయ్ దేవరకొండ కొట్టేశారు. అయితే ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోయ్’ అనే సినిమా రూపొందింది.
మారుతిపై అప్పటివరకు బూతు డైరెక్టర్ అనే ముద్ర ఉంది. కానీ రూటు మార్చి ‘భలే భలే మగాడివోయ్’ అనే ఫ్యామిలీ సినిమా చేస్తున్నాడు అంటే అంతా షాక్ అయ్యారు.
విపరీతమైన మతి మరుపుతో బాధపడే హీరోగా నానిని పెట్టి మారుతి చేసిన ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
2015 వ సంవత్సరం సెప్టెంబర్ 4న రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలై నేటితో 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.10 cr |
సీడెడ్ | 2.10 cr |
ఉత్తరాంధ్ర | 2.15 cr |
ఈస్ట్ | 1.55 cr |
వెస్ట్ | 1.05 cr |
గుంటూరు | 1.65 cr |
కృష్ణా | 1.30 cr |
నెల్లూరు | 0.50 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 17.40 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.60 cr |
ఓవర్సీస్ | 6.11 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 27.11 cr |
‘భలే భలే మగాడివోయ్’ చిత్రం రూ.14.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా ఏకంగా రూ.27.11 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తంగా బయ్యర్లకు రూ.12 కోట్ల వరకు లాభాలు అందించింది.