స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన ప్రతిభతో సినిమాసినిమాకు దర్శకుడిగా పేరుప్రఖ్యాతులు పెంచుకుంటున్నారు. అద్భుతంగా సినిమాను తెరకెక్కించడమే కాక ఆ సినిమాను అద్భుతంగా మార్కెట్ చేసే ప్రతిభ కూడా రాజమౌళి సొంతమని చెప్పవచ్చు. రాజమౌళి తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల ద్వారా తన పేరును బ్రాండ్ గా మార్చుకున్నారు. రాజమౌళిని చూసి ఈతరం డైరెక్టర్లు ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. తను అనుకున్న విధంగా సన్నివేశాలు వచ్చేవరకు రాజీ పడని రాజమౌళి ఎంతోమంది స్టార్ హీరోలకు తన సినిమాల ద్వారా ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా త్వరలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. మహేష్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తానని రాజమౌళి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రముఖ నటుడు భానుచందర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సింహాద్రి సినిమా సమయంలో రాజమౌళి దేశం గర్వించదగిన దర్శకుడు అవుతాడని చెప్పానని
సింహాద్రి సినిమా తర్వాత ఫోన్ చేస్తే మీరు అందుబాటులోకి రావడం కష్టమవుతుందని రాజమౌళితో చెప్పానని భానుచందర్ అన్నారు. రాజమౌళి నుంచి సినిమా తీయడంతో పాటు ప్రచారం చేయడం, హిట్ చేయడం నేర్చుకోవాలని ఆయన అన్నారు. చాక్లెట్ పేపర్ లో మట్టిని పెట్టి అద్భుతమైన చాక్లెట్ అని రాజమౌళి నమ్మించగలరని ఆయన కామెంట్లు చేశారు. ఇలా ఎవరు పడితే వాళ్లు చేయలేరని ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్నవాళ్లు మాత్రమే చేయగలరని ఆయన అన్నారు.
భానుచందర్ రాజమౌళి గొప్పదనం గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మరెన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళి మహేష్ కాంబో సినిమాకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!