పవన్, మహేష్ బాబు అంటే ఇష్టం : భానుప్రియ
- October 12, 2016 / 03:19 PM ISTByFilmy Focus
“పవన్ అంటే చాలా ఇష్టం. పవన్‌ని మించిన హీరో లేడు. అత్తారింటికి దారేది సినిమా ఇప్పటికి ఎన్నో సార్లు చూసాను”… ఈ మాటలు అన్నది నేటి బ్యూటీ కాదు, అలనాటి మేటి హీరోయిన్ భానుప్రియ. స్టేట్ రౌడీ, స్వర్ణకమలం, అన్వేషణ తదితర ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె నటించి మంచి పేరు తెచ్చుకుంది.
అనంతరం హీరోలకు తల్లిగా జయం మనదేరా, ఛత్రపతి వంటి సినిమాల్లో కంటతడి పెట్టించింది. ప్రస్తుతం బుల్లి తెరలోను మహిళలను ఆకట్టుకుంటోంది. భానుప్రియ తాజాగా ఇంటర్వ్యూ లో ఆసక్తికర సంగతులు వెల్లడించింది. తనకి నేటి హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని వివరించింది వారి నటనతో పాటు, లుక్ బాగుంటుందని అభినందించింది. అంతే కాదు అవకాశం ఇస్తే మహేష్, పవన్ పక్కన హీరోయిన్‌గా నటిస్తానని చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచింది.
ఆమె మాటలు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా.. పవన్, మహేష్ లు భవిష్యత్తులో డ్యూయల్ రోల్ ఉండే సినిమాలు చేస్తే అందులో సీనియర్ పాత్రకు జోడిగా తాను నటిస్తానంటూ ఇప్పుడే కర్చీఫ్ వేసినట్లు తెలుస్తోంది. మరి టాలీవుడ్ దర్శకులు సీనియర్ యాక్ట్రస్ మాటలను గుర్తు పెట్టుకుంటారో.. లేదో?

















