ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసిన సినిమాలలో ఇండియన్2 (Bharateeyudu 2) సినిమా ముందువరసలో ఉంటుంది. శంకర్ (Shankar) బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాతో సంచలనాలు సృష్టిస్తాడని భావించగా అందుకు భిన్నంగా జరిగింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇండియన్2 సినిమాకు ఓటీటీ నుంచి సైతం ఇబ్బందులు ఎదురవుతున్నారని వార్తలు వినిపించాయి. అయితే వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చేసింది.
ఆగష్టు నెల 9వ తేదీ నుంచి ఇండియన్2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరిందని అందుకే ఆగష్టు 9వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. థియేటర్లలో ఫ్లాపైన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఒకప్పుడు వరుస విజయాలతో ఒక వెలుగు వెలిగిన శంకర్ ఈ మధ్య కాలంలో పెద్దగా పస లేని స్క్రిప్ట్ లతో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేస్తున్నారు. సుజాత రంగనాథన్ మరణం తర్వాతే శంకర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. శంకర్ సినిమాలు గ్రాండ్ గా ఉంటున్నా కథ, కథనం ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించేలా లేకపోవడం గమనార్హం. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా శంకర్ సైతం మారాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పస లేని కథనంతో సినిమాలు తీస్తే శంకర్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉన్నాయి. నెగిటివ్ కామెంట్ల గురించి శంకర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాతో శంకర్ కు పూర్వ వైభవం వస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు. శంకర్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండగా కొన్ని సినిమాలకు శంకర్ పారితోషికంకు బదులుగా వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది.