పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంభాషణలు,స్క్రీన్ ప్లే ను అందించడంతో పాటు కథలో మార్పులు చేయడం కూడా జరిగింది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఆంధ్రలో ఈ చిత్రానికి ప్రభుత్వం నుండీ ఎన్నో అవంతరాలు ఎదురైనప్పటికీ రికార్డు ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.సోమవారం నాడు కొంత డ్రాప్స్ కనబడినప్పటికీ పర్వాలేదు అనిపించింది. ఈ చిత్రం 4 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
24.85 cr
సీడెడ్
7.85 cr
ఉత్తరాంధ్ర
5.10 cr
ఈస్ట్
3.89 cr
వెస్ట్
4.12 cr
గుంటూరు
4.22 cr
కృష్ణా
2.68 cr
నెల్లూరు
1.93 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
54.64 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
6.65 cr
ఓవర్సీస్
10.31 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
71.60 cr
‘భీమ్లా నాయక్’ చిత్రానికి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.71.6 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.38.4 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 వ రోజున అదీ సోమవారం నాడు కూడా ఈ చిత్రం రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.మంగళవారం నాడు శివరాత్రి సెలవు ఉండడంతో భారీ కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది. మరి ఆ ఛాన్స్ ను ‘భీమ్లా’ ఎంత వరకు వాడుకుంటాడో చూడాలి..!