పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా పలు ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. వీక్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్లు ఊహించని స్థాయిలో డ్రాప్ అయ్యాయి. శుక్రవారం రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుండటంతో భీమ్లా నాయక్ థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమా రిలీజ్ సమయంలో ఏపీలో టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉండటం కూడా భీమ్లా నాయక్ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది.
అయితే భీమ్లా నాయక్ హిందీ వెర్షన్ ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా ఈ సినిమా ఏప్రిల్ నెలకు వాయిదా పడిందని సమాచారం అందుతోంది. ఇప్పటికే హిందీలో విడుదలైన భీమ్లా నాయక్ థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెలలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు హిందీలో కూడా రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజవుతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ హిందీ వెర్షన్ వాయిదా పడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే భీమ్లా నాయక్ వాయిదాకు సంబంధించి మేకర్స్ నుంచి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందించగా థమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా నిత్యామీనన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించడం గమనార్హం. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించగా 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
తెలుగులో హిట్టైన ఈ సినిమా హిందీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. మేకర్స్ తెలుగు వెర్షన్ కు, హిందీ వెర్షన్ కు స్వల్పంగా మార్పులు చేసే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ లో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు పాజిటివ్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే పవన్ వరుసగా రీమేక్ సినిమాలలో నటించడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.