సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో త్రివిక్రమ్ మాటలు, కథనం అందిస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. ఇప్పటికే సంక్రాంతి రేసు నుంచి సర్కారు వారి పాట సినిమా తప్పుకోగా భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ కూడా మారే అవకాశాలు ఉన్నాయి. సర్కారు వారి పాట సమ్మర్ కు షిఫ్ట్ కాగా భీమ్లా నాయక్ ను మాత్రం సమ్మర్ కు షిఫ్ట్ చేసే పరిస్థితులు లేవు.
రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ కావడం ఇప్పటికే రాధేశ్యామ్ కు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగడంతో ఆ సినిమా రిలీజ్ డేట్ ను మార్చే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7వ తేదీన రిలీజ్ కానుండటంతో సంక్రాంతి పోటీ నుంచి భీమ్లా నాయక్ తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పవన్ అభిమానులు జనవరి 26 ఈ సినిమాకు బెస్ట్ డేట్ అని భావిస్తున్నారు.
రిపబ్లిక్ డే రోజున సినిమా విడుదలైతే రికార్డు స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 4వ తేదీన ఆచార్య రిలీజయ్యే వరకు భీమ్లా నాయక్ కు పోటీనిచ్చే సినిమా ఉండదు. భీమ్లా నాయక్ సోలోగా రిలీజ్ కావడం వల్ల ఈ సినిమాకు మేలు జరుగుతుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ సినిమాలకు నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కావడంతో దిల్ రాజు కూడా భీమ్లా నాయక్ ను సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!