మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ‘భోళా శంకర్’ మూవీ ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా..కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రని పోషించింది. మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు. యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. సినిమా పై బజ్ అయితే పెద్దగా ఏర్పడలేదు.
ట్రైలర్ అలాగే రెండు పాటలు జస్ట్ ఓకే అనిపించాయి.అయితే మొదటి రోజు.. మొదటి షోతోనే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ పై ప్రభావం కాస్త గట్టిగానే పడింది అని చెప్పాలి. మొదటి రోజు కొంత ఓకే అనిపించినా రెండో రోజు నుండీ పడిపోయాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
6.52 cr
సీడెడ్
3.09 cr
ఉత్తరాంధ్ర
3.03 cr
ఈస్ట్
1.82 cr
వెస్ట్
2.14 cr
గుంటూరు
2.60 cr
కృష్ణా
1.52 cr
నెల్లూరు
1.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
21.83 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.60 cr
ఓవర్సీస్
2.18 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
25.61 cr (షేర్)
‘భోళా శంకర్’ (Bhola Shankar) చిత్రానికి రూ.78.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.79 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి కేవలం రూ.25.61 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ. 53.39 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అది పూర్తిగా అసాధ్యమని ప్రజెంట్ కలెక్షన్స్ బట్టి క్లియర్ గా స్పష్టమవుతుంది.