Bigg Boss Telugu 5: మానస్ చేసిన మిస్టేక్ వల్లే శ్రీరామ్ గెలిచాడా..?

బిగ్ బాస్ హౌస్ లో టిక్కెట్ టు ఫినాలే టాస్క్ చాలా రసవత్తరంగా ముగిసింది. ఫైనల్ రేస్ లో మానస్ ఇంకా శ్రీరామ్ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా టాస్క్ ఆడారు. వెయిట్ తో ఫ్రేమ్స్ ని పగలగొడుతూ చివరకి వరకూ చాలా ఉత్కంఠంగా ఈ గేమ్ ని ఆడారు. ఇద్దరూ దాదాపుగా రెండు ఫ్రేమ్స్ ని ఒకేసారి పగలగొట్టారు. అయితే, మూడో ఫ్రేమ్ ని పగలకొట్టేందుకు మానస్ చాలా ప్రయత్నించాడు. కానీ, వెయిట్ తో ఉన్న తాడు గిలక దగ్గర ఇరుక్కుపోయింది.

దీంతో మానస్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల శ్రీరామ్ చంద్ర టాస్క్ లో విజయం సాధించాడు.అంతకంటే ముందు శ్రీరామ్ బదులుగా స్లోప్ గేమ్ ని సన్నీ ఆడి గెలిపించాడు. ఆ తర్వాత బల్బ్స్ గేమ్ ని శ్రీరామ్ బదులుగా షణ్ముక్ ఆడి గెలిపించాడు. దీంతో శ్రీరామ్ కి 28 పాయింట్స్ లభించాడు. మానస్ కి 29 పాయింట్స్ లభించాడు. అందుకే వీరిద్దరూ ఫైనల్ టాస్క్ లో పోటీ పడ్డారు.ఇక టిక్కెట్ టు ఫినాలే దక్కించుకున్న శ్రీరామ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.

ఇండియన్ ఐడియల్ సీజన్ 5 విన్నర్, బిగ్ బాస్ సీజన్ 5 టాప్ 5లో ఉన్నానంటూ ప్రేక్షుకులకి థ్యాంక్స్ చెప్పాడు. ఇక్కడే సన్నీ కూడా శ్రీరామ్ గెలిచినందుకు చాలా ఆనందపడ్డాడు. మానస్ ఓడిపోయినందుకు ఫీల్ అవుతుంటే వెళ్లి సర్ధిచెప్పాడు. ఇక ఫస్ట్ ఫైనలిస్ట్ గా శ్రీరామ్ విజేతగా నిలబడ్డాడు కానీ, ఈవారం ఎలిమినేషన్ నుంచీ శ్రీరామ్ సేఫ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే నేరుగా ఫైనల్స్ లోకి అడుగుపెడతాడు. నిజానికి సోషల్ మీడియాలో సిరి టిక్కెట్ టు ఫినాలే గెలిచినట్లుగా వార్తలు వినిపించాయి.

కానీ, సిరి ఫస్ట్ రౌండ్ లోనే బోల్తా కొట్టింది. సౌండ్స్ విని వాటిని సీక్వెన్స్ లో రాయడంలో విఫలం అయ్యింది. ఆ తర్వాత సన్నీ బల్బ్ టాస్క్ లో వెనకబడ్డాడు. దీంతో సన్నీ , ఇంకా సిరి ఇద్దరూ కూడా ఫినాలే రేస్ నుంచీ తప్పుకున్నారు. చివరగా మానస్ తో తలబడ్డ శ్రీరామ్ విన్నర్ గా నిలిచాడు. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus