తెలుగు నాట బిగ్ బాస్ రియాలిటీ షో కి మంచి క్రేజ్ ఏర్పడిందన్న సంగతి తెలిసిందే. డైలీ సీరియల్స్ మరియు బుల్లితెర కామెడీ షో లతో బోరు కొట్టేసిన కొంతమందికి ‘బిగ్ బాస్’ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందనే చెప్పాలి. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో హోస్ట్ చేశాడు. ఇక రెండో సీజన్ ను నాని వంటి క్రేజీ హీరో హోస్ట్ చేశాడు. ఇక మూడో సీజన్ ను ‘కింగ్’ నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. గత రెండు సీజన్ల కంటే ఈ సీజన్ కు మరింత ఆదరణ పెరిగిందనే చెప్పాలి. కంటెస్టెంట్లతో నాగ్ ఎంత సరదాగా మాట్లాడుతున్నాడో తేడా వస్తే అంతే రేంజ్లో కడిగి పారేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. 15 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ‘బిగ్ బాస్3’ ఎవరి రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంది. మరి ఆ వివరాల పై ఓ లుక్కేద్దాం రండి.
1) నాగార్జున (హోస్ట్) : ముందుగా హోస్ట్ చెప్పుకోవాలి అంటే… ఆయన ఒక్కో ఎపిసోడ్ కు 12 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. వారానికి రెండు ఎపిసోడ్ లు ఉంటాయి.. అంటే నెలకి కనీసం 8 ఎపిసోడ్ లు వరకూ ఉంటాయి కాబట్టి.. ఆయనకి 96 లక్షల నుండీ 1 కోటి వరకూ అందుతుందన్న మాట.
2) హేమ : సీజన్ 3 లో మొదటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్… హేమ కు.. ఒక్కో ఎపిసోడ్ కు 1.8 లక్షల వరకూ చెల్లించారట.
3) శ్రీముఖి : ‘పటాస్’ షో ద్వారా మంది క్రేజ్ సందించుకున్న శ్రీముఖి కు.. ఒక్కో ఎపిసోడ్ కు 1.3 లక్షలు చెల్లిస్తున్నారని సమాచారం.
4) శివ జ్యోతి : తీన్మార్ సావిత్రి గా పాపులర్ అయిన శివ జ్యోతికి.. సీజన్ మొత్తం కలిపి 12 లక్షల వరకూ చెల్లిస్తున్నారట. ఆమె హౌస్ లో ఎన్ని రోజులు ఉన్నా.. ఈ అమౌంట్ ఆమెకు వస్తుందన్న మాట.
5) వరుణ్ సందేశ్, వితిక షెరు : ‘బిగ్ బాస్’ చరిత్రలోనే మొదటిసారి భార్యాభర్తలు ఎంట్రీ ఇచ్చారు. వారే వరుణ్ సందేశ్, వితిక షెరు. వీరిద్దరికి కలిపి సీజన్ మొత్తానికి 18 లక్షల వరకూ చెల్లిస్తున్నారట.
6) రాహుల్ సిప్లిగంజ్ : ‘పులిహోర రెసిపీ రాజా’ గా పాపులర్ అయిన రాహుల్ కు సీజన్ మొత్తానికి 10 లక్షల వరకూ చెల్లిస్తున్నారట.
7) జాఫర్ : ముఖాముఖి ద్వారా పాపులర్ అయిన జాఫర్ కు కూడా ఎపిసోడ్ కు 1 లక్ష వరకూ చెల్లించారట.
8) తమన్నా సింహాద్రి : ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రికి మొత్తంగా 2 లక్షల వరకూ పారితోషికం ఇచ్చారని తెలుస్తుంది.
9) ఆషూ రెడ్డి : జూనియర్ సమంతగా పాపులర్ అయిన అషూ రెడ్డి కు మొత్తంగా 4లక్షలు పారితోషికాన్ని ఇచ్చారట.
10) రోహిణి : సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన రోహిణికి కూడా వారానికి 1 లక్ష వరకూ పారితోషికాన్ని ఇచ్చారట.
11) అలీ రెజా : బిగ్ బాస్ కండల వీరుడు అలీ రెజా కు మొత్తంగా 6 లక్షల వరకూ పారితోషికాన్ని ఇచ్చారట.
12) రవి కృష్ణ : సీరియల్స్ లో హీరోగా పాపులర్ అయిన రవి కృష్ణ.. బిగ్ బాస్ లో రేలంగి మావయ్య క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఈయనికి కూడా సీజన్ మొత్తానికి 8 లక్షలు చెల్లించబోతున్నారట.
13) మహేష్ విట్టా : యూట్యూబ్ సెన్సేషన్ మహేష్ విట్టా కి కూడా సీజన్ మొత్తానికి 8 లక్షల పారితోషికం అందబోతుందట.
14) బాబా భాస్కర్ : బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ లో ముందుంటాడు బాబా భాస్కర్. ఆయనకి సీజన్ మొత్తానికి 10 లక్షల వరకూ అందుతుందట.
15) హిమజ : సీరియల్స్ తో పాటు సినిమాలతో కూడా పాపులర్ అయిన హిమజా రెడ్డి కు కూడా సీజన్ మొత్తానికి 12 లక్షల వరకూ అందబోతుందట.
16) శిల్పా చక్రవర్తి : వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన మాజీ యాంకర్ శిల్పా చక్రవర్తి కు 2 లక్షల వరకూ రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తుంది.
17) పునర్నవి భూపాలం : ‘నాలో 6 షేడ్స్ ఉన్నాయి’ అంటూ చెప్పుకుంటూ తిరుగుతున్న పునర్నవి కూడా సీజన్ మొత్తానికి కలిపి 10 లక్షల వరకూ అందుకోబోతోందట.