బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఈసారి గ్రాండ్ ప్రైజ్ మనీని ఎనౌన్స్ చేసింది. ఎప్పటిలాగానే 50 లక్షలు ప్రైజ్ మనీతో పాటుగా ఇల్లు కట్టుకోవడానికి సువర్ణభూమి వారి తరపున 300 గజాల ఫ్లాట్ ని కూడా కానుకగా ఇవ్వబోతున్నారు. స్టేజ్ పైన ఈ విషయాన్ని నాగార్జున ఎనౌన్స్ చేయగానే హౌస్ మేట్స్ అందరూ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఒక్కొక్కరు 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారో చెప్పుకొచ్చారు. ఫస్ట్ పింకీ 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తుందో చెప్పింది. నేను తల్లిదండ్రుల కోసం ఒక ఇల్లు కట్టాలని అనుకుంటున్నా అంటూ చెప్తూనే, నాకు చిన్నప్పటి నుంచీ అమ్మా అని పిలిపించుకోవాలని ఆశ అని,
కానీ బ్యాంక్ బాలన్స్ ఉంటేనే తప్ప పాపని దత్తత ఇవ్వనని చెప్పారని, ఇప్పుడు ఈ మనీని చూపించి ఖచ్చితంగా ఒక పాపని దత్తత తీసుకుంటానని చెప్పింది. శ్రీరామ్ చంద్ర నేను తెలుగు ప్రేక్షకుల హృదయాలని గెలుచుకోవడానికి ఈ షోకి వచ్చాను అని, మనీ అనేది బోనస్ అని చెప్పాడు. ఇప్పటివరకూ మేము అదే పాత ఇంట్లో ఉంటున్నామని, ఈ ప్రైజ్ మనీ వస్తే ఇల్లు కట్టుకోవాలని ఉందని చెప్పాడు. ఇక రవి ఎలిమినేట్ అవ్వకముందు వియా చదువుకోసం ఈ మనీని వాడతానని చెప్పాడు. అంతేకాదు, ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టాలని ఉందని చెప్పాడు.
మరోవైపు కాజల్ తనకి 30 లక్షలు అప్పుడు ఉందని అది తీర్చాలని చెప్పింది. అంతేకాదు, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలని అనుకుంటున్నాను అని సువర్ణకుటీర్ లో అది కట్టుకుంటానని చెప్పింది. సన్నీ వచ్చిన డబ్బులు అన్నీ అమ్మకి ఇచ్చేస్తానని చెప్పాడు. అంతేకాదు, నాగార్జున గారి ఇన్సిపిరేషన్ తో ఒక సెలూన్ కూడా పెట్టాలని ఉందని చెప్పాడు. మానస్ తనకి వచ్చిన డబ్బుతో ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి, యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. షణ్ముక్ ఇద్దరు పిల్లలని దత్తత తీసుకుని పెంచుతున్న అమ్మకి సగం డబ్బులు ఇస్తానని చెప్పాడు.
అంతేకాదు, తనకి ఎన్నోసార్లు సాయం చేసిన దీప్తి సునయనకి సగం డబ్బు ఇస్తానని చెప్పాడు. ఇక సిరి శ్రీహాన్ పేరెంట్స్ కి 10 లక్షల వరకూ అప్పు ఉందని, అది తీర్చేసి వాళ్లకి టెన్షన్ లేకుండా చేస్తానని చెప్పింది. అలాగే, అంధులకి సాయం చేస్తానని తన మనసుని చాటుకుంది. ఇక ఈసారి సీజన్ లో ప్రైజ్ మనీతో పాటుగా స్థలం కూడా వస్తోంది కాబట్టి విన్నర్ కి పండగనే చెప్పాలి. మొత్తానికి అదీ మేటర్.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?