బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు సన్నీపై పెద్దగా అంచనాలు లేవు. కానీ మెల్లమెల్లగా తన బిహేవియర్, గేమ్ ప్లాన్ తో వార్తల్లో నిలిచేవాడు. కొన్ని వారాలయ్యేసరికి సన్నీనే విన్నర్ అని ఫిక్సయిపోయారు జనాలు. అలానే సన్నీకి అత్యధిక ఓట్లు వేస్తూ.. అతడిని గెలిపించారు. ట్రోఫీ అందుకున్న సన్నీ.. తన తల్లి చేతుల్లో పెడుతూ సంతోషపడిపోయాడు.
తన తల్లిని కళావతి అని పేరు పెట్టి పిలుస్తూ.. ఎంతో సరదాగా ఉంటాడు సన్నీ. హౌస్ లోకి ఆమె వచ్చినప్పుడు కూడా కళావతి అని పిలుస్తూ నవ్వించాడు. ఇప్పటివరకు తన తల్లి గురించి మాత్రమే మాట్లాడిన సన్నీ తొలిసారి తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘కొన్ని ఎలా జరుగుతాయో మనకి తెలియదు.. అలాంటి సందర్భం ముందు ముందు రాకూడదని అనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ.
అమ్మా, నాన్న ఇద్దరూ మంచివారే అని అన్నాడు. తను అమ్మతో ఉంటానని.. నాన్నంటే గౌరవమిస్తానని తెలిపాడు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తనకు తెలియదని.. ఈ విషయం గురించి తన తల్లిని కూడా ఎప్పుడూ అడగలేదని.. అది వాళ్ల పెర్సనల్ విషయమని చెప్పుకొచ్చాడు. తనకు కళావతి అనే మంచి ఫ్రెండ్ ఉందని అన్నాడు.
సన్నీకి ఏడాది వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో.. తండ్రి ప్రేమకు దూరమయ్యాడు సన్నీ. కానీ తన తల్లి అప్పటినుంచి అన్నీ తానై కొడుకుని పెంచుకుంది. తొలిసారి తన తల్లి బిగ్ బాస్ ట్రోఫీని గిఫ్ట్ గా అడిగిందని.. కప్పు గెలిచిన రోజు ఓ కొడుకుగా ఆమె ఆనందం చూసి మురిసిపోయానని చెప్పుకొచ్చాడు.