Bigg Boss 7 Telugu: సరికొత్త రికార్డులు సృష్టించిన ‘బిగ్ బాస్ 7’

‘బిగ్ బాస్ సీజన్ 7 ‘ ఈ మధ్యనే సక్సెస్ ఫుల్ గా ముగిసింది. మొదటి నుండి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. అమర్ దీప్ రన్నర్.. కాగా ప్రిన్స్ యావర్ కూడా కొంత డబ్బు అందుకున్నాడు. ఇక ‘బిగ్ బాస్ 7 ‘ కంటెస్టెంట్స్ అందరూ కూడా బాగా పాపులర్ అయ్యారు. వాళ్ళు మంచి మంచి ప్రాజెక్టులు అందుకుంటూ బిజీగా గడుపుతున్నారు. మరో విశేషం ఏంటంటే..

‘బిగ్ బాస్ 7 ‘ కి ముందు రెండు సీజన్లు కొంచెం డల్ గా సాగాయి. వాటికి టి.ఆర్.పి రేటింగ్లు కూడా అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. దీంతో ‘బిగ్ బాస్’ క్రేజ్ పడిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ సీజన్ 7 మాత్రం.. అవన్నీ అపోహలే అని తేల్చి పడేసింది. విషయం ఏంటంటే .. ‘బిగ్ బాస్ 7 ‘ ప్రారంభమైనప్పటి నుండి మంచి టి.ఆర్.పి రేటింగ్ నే నమోదు చేస్తూ వచ్చింది.

‘ఉల్టా పుల్టా’ అంటూ కొత్త టాస్కులతో సీజన్ 7 ని (Bigg Boss 7 Telugu) డిజైన్ చేయడం కూడా కలిసొచ్చింది అని చెప్పాలి. ఇక ఫినాలే ఎపిసోడ్ అయితే రికార్డు టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘బిగ్ బాస్ 7 ‘ కి ఏకంగా 21 .7 టి.ఆర్.పి రేటింగ్ నమోదైంది.తెలుగు ‘బిగ్ బాస్’ చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని చెప్పాలి.

https://twitter.com/FilmyFocus/status/1740779229468565755

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus