బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ ట్రాన్స్ పోర్ట్ టాస్క్ లో ఒక్కో పార్టిసిపెంట్ హారన్ మోగినపుడల్లా వెహికిల్ లో కూర్చోవాల్సి ఉంటుంది. మిగతా వాళ్లలోనుంచీ ఇద్దరినీ ఏకాభిప్రాయంతో హౌస్ మేట్స్ ఎంచుకుని కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పిస్తారు. అయితే, ఈటాస్క్ అనేది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. నిజానికి ఈవారం ఇంటి కుటుంబ సభ్యులు వస్తారని అనుకున్నారు. కానీ, బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చాడు.
ఇక 50 లక్షల టాస్క్ హౌస్ మేట్స్ కి మంచి మజా ఇచ్చింది. ఈ టాస్క్ చాలా రసవత్తరంగా మారింది. 50లక్షల్లోనుంచీ బిట్ వాల్యూ ఐదు లక్షల లోపు వేయాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ 5 లక్షల కంటే తక్కువ రాయాలి. అంతేకాదు, సేమ్ ఎమౌంట్ ఎవరైనా రాస్తే వాళ్లు రిజక్ట్ అయిపోతారు. దీంతో హౌస్ మేట్స్ బిడ్ ఏం చేయాలి అని చాలాసేపు తర్జన భర్జన పడ్డారు. శ్రీసత్య అయితే సైగలు చేసింది.
శ్రీహాన్ తో తన చీర కాస్ట్ గురించి చెప్తూ తను ఎంత బిడ్ వేసిందనేది ఇండైరెక్ట్ గా చెప్పింది. 4వేలే 9 వందల 99 ఉంటుంది ఈ చీర ధర అంటూ హింట్ ఇచ్చింది. ఈ కారణంగా బిగ్ బాస్ నిర్దాక్షిణ్యంగా శ్రీసత్యని గేమ్ నుంచీ డిస్ క్వాలిఫై చేసేశాడు. దీంతో గేమ్ నుంచీ అవుట్ అయ్యింది. శ్రీసత్య తన చెక్ పైన 4 99 999 రూ. రాసింది. ఈ మొత్తం రాసిన ఇంకా ఇద్దర్ని కూడా బిగ్ బాస్ రిజక్ట్ చేసేశాడు.
రేవంత్ , ఇంకా కీర్తి ఇద్దరూ కూడా 4 99 999 రూపాయలు రాశారు. వీళ్లు రాసింది సేమ్ ఎమౌంట్ కాబట్టి రిజక్ట్ అయిపోయారు. ఇదే టైమ్ లో స్ట్రాటజీ అనుకుంటూ వచ్చి ఇనాయ 4 99 998రూపాయలు అంటే ఒక రూపాయి తక్కువ రాసింది. దీంతో తనే గెలుస్తుందని ధీమాగా ఉంది. కానీ, సేమ్ ఎమౌంట్ రాసి మెరీనా ట్విస్ట్ ఇచ్చింది. దీంతో వీరిద్దరూ కూడా రిజక్ట్ అయ్యారు. తర్వాత సేమ్ టు సేమ్ బిడ్ వేసిన వాళ్లలో ఆదిరెడ్డి , శ్రీహాన్ లు ఉన్నారు.
ఆదిరెడ్డి లక్షరూపాయలు మాత్రమే రాశాడు. సేమ్ టు సేమ్ శ్రీహాన్ కూడా అలాగే లక్షరూపాయలు రాశాడు. విన్నర్ మనీని తగ్గించడం తనకి ఇష్టం లేదని క్లియర్ గా చెప్పారు ఇద్దరూ. లక్షరూపాయలు రాసిన ఇద్దరూ రిజక్ట్ అయ్యారు. ఇక మిగిలింది రోహిత్ ఇంకా రాజ్ వీళ్లిద్దరిలో రోహిత్ 2లక్షల 50వేల ఒక్కరూపాయి రాశాడు. రాజ్ 4 లక్షల 99 వేల 700 రాశాడు. దీంతో రాజ్ ఈవారం ఇమ్యూనిటీని పొందాడు. ఇక్కడే బిగ్ బాస్ ఈ ఐదులక్షలు తిరిగి సంపాదించుకునేందుకు ఛాలెంజస్ ఇచ్చాడు. ఇందులో రోహిత్ రేవంత్ ఇద్దరూ కూడా క్రికెట్ ప్యాడ్స్ కట్టుని రన్స్ తీశాడు.
7 నిమిషాల 30 సెకన్స్ టైమ్ లో సెంచరీ రన్స్ తీయాల్సిందని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో రోహిత్, రేవంత్ ఇద్దరూ ముందుకు వచ్చారు. కానీ అనుకున్న సమయంలో 81 రన్స్ మాత్రమే తీయగలిగారు. ఈ లక్షరూపాయల ఛాలెంజ్ లో ఓడిపోయారు. దీంతో బిగ్బాస్ ప్రైజ్ మనీని 44 లక్షలకి తగ్గించేశాడు. ఆ తర్వాత హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. మరి ఇందులో ఎవరు గెలుస్తారు. ఈవారం ఎవరు కెప్టెన్ అవుతారు అనేది ఆసక్తికరం. ఎందుకంటే, ఇంకా ఆట నాలుగు వారాలే ఉంది కాబట్టి, ఇప్పుడు టాప్ 5కి వెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!