Bigg Boss Telugu OTT: ఓటీటీ లో బిగ్ బాస్ ఫ్లాప్ అవ్వడానికి కారణాలు ఇవే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ 24/7 అంటూ వచ్చిన షో ఫస్ట్ వీక్ పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేదు. నిజానికి ఓటీటీలో షోని ప్లాన్ చేసినపుడే ఇది 24గంటలు లైవ్ వస్తుందని చెప్పారు. కానీ, ఇప్పుడు ఒకరోజు లేట్ గా లైవ్ స్ట్రీమింగ్ అనేది జరుగుతోంది. దీనికోసం 24గంటల పాటు లైవ్ ని ఆపేశారు కూడా. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లవర్స్ సైతం ఈ రియాలిటీ షోని ఫాలో అవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి ప్రధానంగా ఐదు కారణాలు మనం చెప్పుకున్నట్లయితే.,

1. బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో ప్రారంభం అయినపుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేశాడు. అప్పుడు సీజన్ దుమ్మురేచిపోయింది. ఫస్ట్ టైమ్ యంగ్ టైగర్ యాంకరింగ్ చేయడం, సెలబ్రిటీలు షోలో పార్టిసిపేట్ చేయడం, పూణెలో సెట్ ఉండటం, 100 రోజుల పాట మా టీవిలో ప్రసారం కావడం వల్ల ప్రతి గడపలో బిగ్ బాస్ సౌండ్ మారుమోగింది. కానీ, ఆతర్వాత హాట్ స్టార్ ఓటీటీలో ఓటింగ్ ని పెట్టడం, అందులో అన్ సీన్ ఇవ్వడం అనేది సీజన్ 3 నుంచీ స్టార్ట్ అయ్యింది.

అప్పుడు చాలామంది వ్యూవర్స్ అన్ సీన్ చూడటం లేదు కదా అని టైమ్ పాస్ కి మాత్రమే షోని చూశారు. దీంతో ప్రేక్షకుల్లో సీరియస్ నెస్ కాస్త తగ్గింది. సీజన్ 4, సీజన్ 5లు టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు కాబట్టి మరోసారి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాదు, కొంతమంది పార్టిసిపెంట్స్ ని ఇష్టపడిన వారు వాళ్లని బాగా ఫాలో అయ్యారు. కానీ, ఇప్పుడు డైరెక్టర్ గా ఓటీటీలో ప్లే అవుతోంది. అందులోనూ 24గంటలు అంటే షో చూసే పరిస్థితుల్లో ఆడియన్స్ లేరు. పూర్తి షోకి వాళ్లు కనెక్ట్ కాలేకపోతున్నారు.

2. బిగ్ బాస్ షోని ఓటీటీలో 24 గంటలు పెట్టడం అనేది మొదటి నుంచీ ఆడియన్స్ వ్యతిరేకిస్తున్నారు. కనీసం దీనిపైన ఒక ఓపీనియన్ పోల్ ని ఇన్ స్ట్రా గ్రామ్ లో స్టార్ మా యాజమాన్యం పెట్టి ఉండాల్సింది. అది కంప్లీట్ గా మిస్ అయ్యారు. 24 గంటలు ఫాలో అవ్వాలి అంటే అది జరగని పని. ఎవరి పని వాళ్లకి ఉన్న ఈరోజుల్లో అంతసేపు హాట్ స్టార్ లో ఉండటం అనేది ఆడియన్స్ కి కష్టం అయ్యింది.

అంతేకాదు, పనులు మానుకుని షోని ఫాలో అవ్వాలంటే ఇష్టపడలేదు. ఇక్కడే ఒకరోజు మిస్ అయ్యాం కదా అనుకుని అన్ని రోజులు మిస్ అయిపోతున్నారు.

3. బిగ్ బాస్ రియాలిటీ షోలో ఈసారి సీనియర్స్ ని జూనియర్స్ ని మిక్స్ చేయడం వల్ల కూడా షోపై ఆసక్తి తగ్గిపోయింది. ఫేమస్ సెలబ్రిటీలని కనీసం తెచ్చి ఉంటే మరో రేంజ్ లో షో ఉండేదేమో. కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్లే షోలో సంగంమందికి పైగా ఉన్నారు. వాళ్ల గేమ్ ని ఆల్రెడీ చూసేశారు కాబట్టి, అంత ఆసక్తికరంగా ఫాలో అవ్వాలని ఆడియన్స్ కి లేదనే చెప్పాలి.

4. బిగ్ బాస్ ఓటీటీకి నాగార్జునే యాంకర్ అవ్వడం అనేది కూడా ఆడియన్స్ కి అంతగా రుచించలేదు. కనీసం హోస్ట్ ని మార్చి ఉండాల్సింది. అప్పుడు షో పట్ల కొద్దిగా ఆసక్తి ఉండేది. ఇక ఈ రియాలిటీ షో ఇప్పటివరకూ ఫాలో అవ్వని వాళ్లు మద్యలోనుంచీ ఫాలో అవ్వడం అనేది చేయడం లేదు. టెలివిజన్ లో సీరియల్స్ ఫాలో అయ్యే హౌస్ వైఫ్స్ ఇప్పుడు ఈషో పై ఆసక్తిని చూపించడం లేదు.

గతంలో సీరియల్ టైమ్ లో ఇది టెలికాస్ట్ అయ్యేది కాబట్టి కొద్దో గొప్పో ఫాలో అయ్యేవారు. దీనివల్ల రేటింగ్ పెరిగేది. ఇప్పుడు కనీసం ప్రోమోలు కూడా పూర్తి స్థాయిలో ఇంట్రస్టింగ్ గా లేవు. ఇది కూడా ఒక కారణం.

5. అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే, నెట్ బ్యాలన్స్. 24గంటలు షోని హాట్ స్టార్ లో ఫాలో అవ్వాలి అంటే నెట్ బ్యాలన్స్ కావాలి. చాలామంది డేటా ప్లాన్స్ ఆచితూచి వేసుకుంటారు. అందులోనూ వైఫై వాడే వాళ్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక మొబైల్ డేటా ఎక్కువగా ఖర్చు అయిపోవడం అనేది ప్రధానమైన సమస్య. అందుకే షోని వన్ అవర్ మాత్రమే ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

హాట్ స్టార్ లో లో చూడాలి అన్నా కూడా మొబైల్ ఛార్జింగ్ సమస్య కూడా ఉంది. అలాగని, కంప్యూటర్ ముందు గంటలు గంటలు కూర్చోవాలన్నా కూడా కష్టమే. పోనీ టీవిలో ప్లే చేసుకుందాం అనుకున్నా, డేటా కంజ్యూమ్ ఎక్కువగా ఉండటం అనేది షోపై ఆసక్తిని బాగా తగ్గించేస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus