Bindu Madhavi: చరిత్ర సృష్టించిన బిందుమాధవి..! ఓటీటీలో ఫస్ట్ లేడీ బిగ్ బాస్ విన్నర్..!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వస్తున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు సీజన్ 1 రియాలిటీ షోని ఫిబ్రవరి 26వ తేది నుంచీ ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. నాన్ స్టాప్ షో విన్నర్ ఎవరు అనేది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తునే ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న బజ్ ప్రకారం బిందు మాధవి టైటిల్ విన్నర్ గా నిలిచినట్లుగా సమాచారం తెలుస్తోంది. షో మొదలైనప్పటి నుంచీ ఎంతో మంది బిగ్ బాస్ వ్యూవర్స్ కి హాట్ ఫేవరెట్ గా నిలిచింది బిందుమాధవి.

తన ఆటతీరుతోనే ఆడియన్స్ హృదయాలని కొల్లగొట్టింది బిందు మాధవి. గేమ్ లో చూపించిన పట్టుదల, స్పూర్తి ఆమెని టైటిల్ వరించేలా చేసింది. ఫస్ట్ నుంచీ ట్విట్టర్ లో బిందు ద సెన్సేషన్ అనే హ్యాష్ ట్యాగ్ హల్ చల్ చేస్తూనే ఉంది. హ్యాష్ ట్యాగ్ మస్తీతో బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన బిందు తన ఆటతీరుతో అందరినీ మెప్పించింది. బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని గొడవలు అయినా కూడా తను ఒంటరిగా అందర్నీ ఎదిరించింది. ఎన్నో సవాళ్లని ఎదుర్కుంది.

టాస్క్ లో పెర్ఫామెన్స్ ఇవ్వకపోయినా తన మాట తీరుతో, నామినేషన్స్ లో తనదైన మార్క్ ని క్రియేట్ చేసింది బిందుమాధవి. విమర్శలని, సవాళ్లని ఎదుర్కోవడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఆడియన్స్ కి చూపించింది. ముఖ్యంగా రెండో వారం నుంచీ అఖిల్ ని నామినేషన్స్ ఎదిరించిన తీరు, తన బెస్ట్ ఫ్రెండ్ అయిన శివ తప్పు చేస్తే నామినేట్ చేసిన తీరు బిగ్ బాస్ ప్రేక్షకులని ఆలోచింపజేసేలా చేసింది. అంతేకాదు, వీక్స్ గడిచేకొద్ది హౌస్ లో శత్రువులు ఎక్కువ అవుతున్నా కూడా ఎక్కడా కుంగిపోలేదు.

చాలా మొండిగా ఆటలో దూసుకువెళ్లింది బిందు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన శివని రెండు వారాలు నామినేట్ చేసి తనకి గేమ్ లో ఎవరైనా ఒకరే అని నిరూపించింది. ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా తిరిగి మళ్లీ గేమ్ పైనే దృష్టిపెట్టి గేమ్ లోనే వారికి సమాధానం చెప్పింది. మిత్రా, తేజు, అషూ, అరియానా, ఆఖరికి శివ కూడా తనకి ఎదురుతిరిగినా వారికి సమాధానం చెప్పింది బిందు. ఆఖరి వారాల్లో నటరాజ్ మాస్టర్ పర్సనల్ గా టార్గెట్ చేసినా కూడా మాస్టర్ ని ఎదిరించి అమ్మోరులా ఫోజు పెట్టి రెచ్చిపోయింది.

మాస్టర్ ఎత్తుగడలని తిప్పికొట్టింది. అదే బిందు మాధవికి ప్లస్ అయ్యింది. ఆడియన్స్ కి మరింత చేరువ చేసింది. సోషల్ మీడియాలో మొదటి నుంచీ బిందు మాధవికి ఫాలోవర్స్ ఉన్నారు. ఆవకాయ్ బిర్యాని, రామరామ కృష్ణకృష్ణ, పిల్ల జమిందార్ లాంటి సినిమాలు చేయడం అనేది బిందు మాధవికి ప్లస్ అయ్యింది. అంతేకాదు, తమిళ బిగ్ బాస్ లవర్స్ కి సైతం బిందు చాలా సుపరిచితురాలు కావడం అనేది ఆమెకి ఓటింగ్ ని మరింత పెంచింది.

నిజానికి తమిళ బిగ్ బాస్ విన్నర్ గా బిందు మాధవినే గెలుస్తుందని అనుకున్నారు. కానీ, హౌస్ మేట్స్ వేసిన ఓటింగ్ వల్ల మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యింది బిందు. కానీ, ఇప్పుడు ఆ ఛాన్స్ తెలుగులో లేకపోవడం వల్ల టైటిల్ విన్నర్ గా నిలిచింది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన పార్టిసిపెంట్స్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ కూడా బిందు మాధవిని ఆడపులి గా అభివర్ణించారు. బిందు మాధవి తండ్రి భాస్కర్ రావుగారు కూడా ఆడపులిలా ఆడావ్ అంటూ పొగడటంతో బిందు మరింత రెచ్చిపోయింది.

ఆఖరి వారంలో నటరాజ్ మాస్టర్ తో పెద్ద మాటల యుద్ధమే చేసింది. ఇదే ఆమెని టైటిల్ విన్నర్ గా చేసింది. అఖిల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ తో పోటీ పడటం అంటే మాములు విషయం కాదు. గేమ్ ని చాలా జాగ్రత్తగా ఆడాలి. మాట్లాడేటపుడు ఆచితూచి మాట్లాడాలి. గేమ్ లో కూడా లాజిక్స్ ని వెతకాలి. లేదంటే చిన్న పాయింట్ దొరికినా బ్యాడ్ అయిపోతారు. బిందు మాధవి ఈ విషయంలో విజయం సాధించింది.

ఫస్ట్ టైమ్ తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే లేడీ కంటెస్టెంట్ గా, బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 టైటిల్ ని కైవసం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది బిందు. చరిత్రని సృష్టించింది. దీంతో ఇప్పుడు బిందుమాధవికి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని అంటున్నారు బిందు మాధవి ఫ్యాన్స్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.