Bobby Deol,Balakrishna: బాలయ్యకు అది దేవుడిచ్చిన వరం!: బాబీ డియల్

బాబీ డియల్ ప్రస్తుతం వరల్డ్ వైడ్ మారుమోగుతున్నటువంటి పేర్లలో ఈయన పేరు కూడా ఒకటి తాజాగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి యానిమల్ సినిమాలలో బాబీ డియోల్ ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా లేకుండా తన నటనతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటన తర్వాత బాబీ డియోల్ నటన గురించి పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుపుతున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ఈయన నటనకు పెద్ద ఎత్తున అభిమానులు పెరిగిపోయారు. దీంతో ఈయనకు వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఇకపోతే బాబి డియోల్ బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబి దర్శకత్వంలో రాబోతున్న బాలయ్య 109 సినిమాలో కూడా భాగమయ్యారని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా బాబి డియోల్ బాలయ్య గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా బాబి (Bobby Deol) మాట్లాడుతూ బాలా సార్ చాలా మంచి వ్యక్తి ఆయనని నేను సెట్ మీద కలిశాను. బాలకృష్ణ గారు చాలా ఎనర్జీతో ఉంటారు అలా ఎనర్జీతో ఉండటం నిజంగా దేవుడు ఇచ్చినటువంటి వరం అని తెలియజేశారు. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతంగా ఉంటుందని అలాగే చాలా చాలెంజింగ్ అని కూడా బాబీ డియోల్ బాలయ్యతో నటించడం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక బాలకృష్ణ ఈ మధ్యకాలంలో తన వయసుకు అనుగుణంగా ఉన్నటువంటి పాత్రలను ఎంపిక చేసుకొని వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అనే మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుసగా మూడు వంద కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈయన తదుపరి చిత్రం బాబి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus