యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయాల్లోకి రావాలని రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. తారక్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో కథనాలు సైతం ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం వార్2 సినిమా షూటింగ్ లో తారక్ పాల్గొంటుండగా 2034లో తారక్ సీఎం అంటూ బాలీవుడ్ నటుడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముంబైలోని ఒక పార్టీకి తారక్ హాజరు కాగా ఆ పార్టీలో పాల్గొన్న అక్బర్ బిన్ తబర్ సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్ వాయిస్ గురించి, ఎన్టీఆర్ అమలు చేసిన పథకాల గురించి కామెంట్లు చేశారు.
సీనియర్ ఎన్టీఆర్ వాయిస్ గొప్ప వాయిస్ అని మళ్లి అలాంటి వాయిస్ జూనియర్ ఎన్టీఆర్ లో చూశానని అక్బర్ అన్నారు. టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్స్ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ అని అక్బర్ పేర్కొన్నారు. 2034లో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ అక్బర్ జోస్యం చెప్పగా ఆ జోస్యం నిజం కావాలని నెటిజన్లు సైతం ఫీలవుతున్నారు.
ప్రస్తుతం పాలిటిక్స్ కు దూరంగా ఉన్న తారక్ సరైన సమయంలో పాలిటిక్స్ పై దృష్టి పెడితే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర (Devara) , వార్2, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు కాగా ఈ సినిమాలు బిజినెస్ పరంగా కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలతో సైతం బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం తన యాక్టింగ్ టాలెంట్ తో మరిన్ని మెట్లు పైకి ఎదగడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.