Akhanda Movie: బోయపాటి మార్కు సీన్స్‌ సిద్ధం చేస్తున్నాడట

బోయపాటి – బాలయ్య కాంబినేషన్‌ అంటే హై ఆక్టేన్‌ యాక్షన్‌ అని అందరూ అనుకుంటున్నారు. చురుకుపుట్టించే డైలాగ్‌లు వాటికి అదనం. ఇవన్నీ పక్కనపెడితే ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, క్లైమాక్స్‌ సీన్స్‌ ఆ కాంబోకి హైలైట్‌గా నిలుస్తూ వచ్చాయి. ‘లెజెండ్‌, ‘సింహా’లో అలాంటి సీన్స్‌ మనం ఇప్పటికే చూశాం. ఇప్పుడు హ్యాట్రిక్‌ కొట్టడానికి ‘అఖండ’గా త్వరలో రాబోతున్నారు. ఇందులోనూ అలాంటి సీన్స్‌ ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు సినిమా షూటింగ్‌లో బ్యాలెన్స్‌ ఉన్నది కూడా ఆ సీన్సేనట.

‘అఖండ’ సినిమాను అనుకున్న ప్రకారం అయితే ఈ నెల 28న విడుదల చేయాలి. అందుకుతగ్గట్టుగానే ఆ మధ్య బోయపాటి జెట్‌ స్పీడ్‌లో సినిమా షూటింగ్‌ చేసుకుంటూ వచ్చారు. బాలయ్య ఫ్యాన్స్‌కు పుట్టిన రోజు ముందే ట్రీట్‌ ఇచ్చేద్దామని ఫిక్స్‌ అయిపోయారు. అయితే అప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చింది. దీంతో షూటింగ్స్‌ ఆగిపోయాయి. సినిమా విడుదల వాయిదాపడే పరిస్థితి వచ్చింది. అయితే ఈ గ్యాప్‌లో సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసేస్తున్నాడు.

సినిమా పెండింగ్‌ వర్క్‌ గురించి చూస్తే… ఇంకా క్లైమాక్స్‌ సీన్స్‌ పూర్తి చేయాల్సి ఉందట. ముందుగా అనుకున్నట్లు బాలయ్య -బోయపాటి కాంబోలో క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ మామూలుగా ఉండదు. కాబట్టి వెయిట్‌ చేసినా తప్పు లేదు. ఈ గ్యాప్‌లో ఆ సీన్స్‌ ఇంకొంచెం బాగా సిద్ధం చేసుకుంటాడు బోయపాటి. కాబట్టి ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. అయితే క్లైమాక్స్‌ ఇంతవరకు ఎందుకు షూట్‌ చేయలేదు? అన్నట్లు ఈ సినిమా నుండి ఫైట్‌ మాస్టర్లు రామ్‌ లక్ష్మణ్‌ తప్పుకున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి! ఈ రెండింటికీ ఏం సంబంధం లేదు కదా!

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus