పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈ నెల 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమాలో బ్రహ్మానందం కూడా ఒక పాత్రలో కనిపించనున్నారు. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలో ఈ పాత్ర లేకపోయినా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమ్లా నాయక్ సినిమా కోసం స్పెషల్ రోల్ ను క్రియేట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ తన సెంటిమెంట్ వల్లే బ్రహ్మానందం కోసం పాత్ర క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.
త్రివిక్రమ్ బ్రహ్మానందం కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘన విజయం సాధించాయి. ఫుల్ లెంగ్త్ రోల్ కాకపోయినా తన సినిమాలలో బ్రహ్మానందం కొన్ని సెకన్ల పాటు కనిపించేలా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భీమ్లా నాయక్ సినిమా క్లైమాక్స్ లో బ్రహ్మానందం ఎంట్రీ ఉంటుందని గతేడాది జాతిరత్నాలు సినిమాతో కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం ఈ ఏడాది భీమ్లా నాయక్ తో నవ్వించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ను బ్రహ్మానందం తన స్టైల్ తో చెప్పే సీన్లు హిలేరియస్ గా వచ్చాయని సమాచారం అందుతోంది.
బ్రహ్మానందంకు కమెడియన్ గా మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలలో భీమ్లా నాయక్ ఒకటి అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో బ్రహ్మానందంకు సినిమా ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ సక్సెస్ సాధిస్తే బ్రహ్మానందంకు ఆఫర్లు పెరుగుతాయని చెప్పవచ్చు. బ్రహ్మానందం సైతం వయస్సు పెరగడంతో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు అ అక్షరంతో మొదలవుతాయనే విషయం తెలిసిందే.
ఈ సినిమాకు త్రివిక్రమ్ డైరెక్టర్ కాకపోవడంతో అ సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇవ్వలేదా? లేక మరేదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ హీరోగా సినిమా తెరకెక్కితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి.