Ravi Teja, Balakrishna: బాలయ్య-రవితేజలకు పడదా..? అసలు విషయం చెప్పిన దర్శకుడు!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి ‘అన్ స్టాపబుల్’ అనే షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో బాలయ్య మాటలను, డైలాగ్స్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు సెలబ్రిటీలు హోస్ట్ చేసిన షోలు ఒక ఎత్తయితే.. బాలయ్య ‘అన్ స్టాపబుల్’ మరో ఎత్తు. రెగ్యులర్ కాన్సెప్ట్ ని కూడా తన హోస్టింగ్ స్కిల్స్ తో చాలా ఎంటర్టైనింగ్ గా మార్చేశారు బాలయ్య. మోహన్ బాబు గెస్ట్ గా మొదలైన ఈ షో మహేష్ బాబు ఎపిసోడ్ తో మొదటి సీజన్ ముగియనుంది.

ఈ షోకి చాలా మంది గెస్ట్ లుగా వచ్చాయి. అందులో హీరో రవితేజ కూడా ఉన్నారు. నిజానికి రవితేజ ఈ షోకి వస్తున్నాడనే విషయం హాట్ టాపిక్ అయింది. బాలకృష్ణకి, రవితేజకి మధ్య గొడవలు ఉన్నాయని.. బయట వారిద్దరికీ అసలు పడదనే టాక్ ఉండడంతో అందరి దృష్టి ఈ షోపై పడింది. ఫైనల్ గా ఈ షోలో తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారు బాలయ్య. తాజాగా టాలీవుడ్ దర్శకుడు, ‘అన్ స్టాపబుల్’ రైటర్ బీవీఎస్ రవి అలియాస్ మచ్చ రవి ఈ ఇష్యూ గురించి మాట్లాడారు.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రవితేజ-బాలకృష్ణల గొడవ గురించి మాట్లాడారు. బాలయ్య బాబుకి రవితేజకి గొడవ జరిగినట్లు ఉన్న ప్రచారంలో నిజం లేదని రవి అన్నారు. గత 20 సంవత్సరాల నుంచి రవితేజతో రెండు రోజులకు ఒకసారి మాట్లాడుకునేంత చనువు తనకుందని..

అలాంటిది తనకే తెలియలేదంటే రవితేజ- బాలకృష్ణ మధ్య క్లాష్ లేదని అర్థం చేసుకోవచ్చని అన్నారు. షూటింగ్ సమయంలో బాలయ్య, రవితేజ చాలా సార్లు కలుసుకున్నారని.. చిరంజీవి ఇచ్చిన పార్టీలో బాలయ్య, రవితేజలతో పాటు మేమంతా ఎంజాయ్ చేశామని చెప్పుకొచ్చారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus