రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి2 సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కావడంతో పాటు టాలీవుడ్ సినిమాల మార్కెట్ ను పెంచిన సంగతి తెలిసిందే. బాహుబలి, బాహుబలి2 కలెక్షన్ల పరంగా ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా, రాజమౌళికి పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును తెచ్చిపెట్టాయి. బాహుబలి2 విడుదలై మూడు సంవత్సరాలు గడిచినా ఆ సినిమా కలెక్షన్లకు దరిదాపుల్లో కూడా మరే తెలుగు సినిమా కలెక్షన్లను సాధించలేదు. ఆర్ఆర్ఆర్ మూవీతో రాజమౌళి బాహుబలి2 కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తాడని చరణ్, తారక్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అయితే మగధీర మూవీ ఫ్లాపై ఉంటే మాత్రం బాహుబలి, బాహుబలి2 సినిమాలను రాజమౌళి తెరకెక్కించే వారు కాదని సమాచారం. రాజమౌళి ఊహల్లో బాహుబలి ఎప్పటినుంచో ఉన్నా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాల్సి ఉండటంతో కెరీర్ తొలినాళ్లలో రాజమౌళి మాస్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన మగధీర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాహుబలి స్క్రిప్ట్ తో అద్భుతాలు చేయవచ్చని రాజమౌళి భావించగా ఆ నమ్మకమే నిజమైంది.
రాజమౌళి మొదట ఒక పార్ట్ గానే బాహుబలిని తెరకెక్కించాలని భావించగా ఆ తరువాత కొన్ని కారణాల వల్ల రెండు పార్టులుగా తెరకెక్కించాలని రాజమౌళి నిర్ణయం తీసుకున్నారు. ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా 5 సంవత్సరాల డేట్స్ ఇచ్చారు. బాహుబలి, బాహుబలి2 సినిమాలు ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచడంతో పాటు మార్కెట్ ను పెంచాయి.