ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ ను ఏర్పరుచుకుని.. హిట్లు మీద హిట్లు కొడుతూ మినిమమ్ గ్యారెంటీ హీరో అనుకున్న జగపతి బాబు.. ఆ తర్వాత కుర్ర హీరోల ఎంట్రీతో సైడ్ అయిపోయాడు.అతని సినిమాలు ఎప్పుడొస్తున్నాయో.. ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. పీకల్లోతు అప్పుల్లోకి కూడా కూరుకుపోయాడు. అలాంటి టైములో ‘లెజెండ్’ చిత్రంతో జగపతి బాబుకి స్ట్రాంగ్ రీ ఎంట్రీ అందించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆ సినిమాలో భీభత్సమైన విలన్ గా జగ్గూభాయ్ యాక్టింగ్ ఓ రేంజ్లో ఉంటుంది.
బాలకృష్ణని తలదన్నేలా ఉంటుంది అనడంలో కూడా అతిశయోక్తి లేదు. దాంతో జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ ఊపందుకుంది. వరుసగా ‘శ్రీమంతుడు’ ‘నాన్నకు ప్రేమతో’ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఆఫర్లని దక్కించుకున్నాడు. అలాంటి టైములో జగపతి బాబుని మిగిలిన భాషల్లో కూడా బిజీ అయ్యేలా చేసింది మన సుకుమార్ అనే చెప్పాలి. ‘రంగస్థలం’ చిత్రంలో ఫణింద్ర భూపతి పాత్రతో అతన్ని మరింత బిజీ అయ్యేలా చేసాడు. అయితే జగపతి బాబునే ఇన్స్పిరేషన్ గా తీసుకుని శ్రీకాంత్, సునీల్ కూడా ఓ అటెంప్ట్ చేసారు.
కానీ ఇద్దరూ సక్సెస్ కాలేకపోయారు అనే చెప్పాలి. ‘అఖండ’ చిత్రంలో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా కనిపిస్తాడు అనుకుంటే అతన్ని పార్ట్ టైం విలన్ గానే పెట్టాడు బోయపాటి. ఆ చిత్రం తర్వాత శ్రీకాంత్ బిజీ అవుతాడు అనుకుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. మళ్ళీ సహాయ నటుడిగా కొనసాగాల్సిందే. ఇక ‘పుష్ప’ లో సునీల్ పాత్ర కూడా ‘రంగస్థలం’ లో జగపతి బాబు పాత్రలా క్లిక్ అవుతుంది..
తర్వాత సునీల్ మరింత బిజీ అయిపోతాడు అని అంతా అనుకున్నారు. కానీ అది కూడా జరగేట్టు లేదు. ‘పుష్ప’ లో అజయ్ ఘోష్ పండించిన విలనిజాన్ని కూడా సునీల్ పండించలేకపోయాడు.